కంది మన రాష్ట్రంలో దాదాపు 12లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతు,2లక్షల టన్నుల ఉత్పత్తినిస్తుంది. ఎకరాకు 168కిలోల సరాసరి దిగుబడినిస్తుంది.ప్రత్తి,మిరప పోగాకులకు ప్రత్యామ్నాయ౦గా అలాగే పెసర,మినుము,సోయాచిక్కుడు,వేరుశనగ లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కందిని ఖరీఫ్ తో పండించవచ్చు.కందిని సాధారణంగా తొలకరి పంటగా అనేక ఇతర పంటలతో కలిపి మిశ్రమ పైరుగా సాగుచేస్తుంటారు.కందిని రబీ లో కూడా పండించవచ్చు.