ఎకరాకు పశువుల ఎరువు 10 బళ్ళు,వేపపిండి 150 కిలోల చివరి దుక్కులలో వేయవలెను.
జింకులోపము సరిదిద్దుటకు విడిగా 20కిలోలు (ఎకరాకు) జింకు సల్ఫేట్ ఆఖరి దుక్కిలో వేయవలెను
భూసార పరిక్షననుసరించు రసాయనిక ఎరువుల మోతాదు నిర్ణయించవలెను.
సాధారణంగా 1 ఎకరా వేరుశనగ పైరుకు(కిలో లలో)
యూరియా సింగల్ సూఫర్ఫాస్ఫేట్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్
ఖరీఫ్ 20 100 30 రబి 20 100 30
పైన చూపిన ఎరువులను విత్తేముందు వేయాలి.శాస్త్రజ్ఞుల పరిశోధనలో విత్తిన 30రోజులకు పై పాటుగా యురియా వేయడం వలన పెద్ద ఉపయోగం లేదని తేలింది.కావున రైతు సోదరులు ఎరువుల మీద పెట్టే వృధా ఖర్చు తగ్గించుకోగలరు.
తొలిపూతదశలో(30 రోజులు)1 ఎకరమునకు 200కి.గ్రా జిప్సమ్ ఎరువును మొదళ్ళుకు దగ్గరగా 5సె౦.మీ లోతులో వేయాలి.జిప్సమ్ వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ అవసరం.జిప్సంలోని కాల్షియం,సల్ఫర్ వలన గింజ బాగా ఊరటమే కాకుండా నూనె శాతం కూడా పెరుగుతుంది.
పంట
యూరియా
సింగల్ సూపర్ ఫాస్ఫేట్
మ్యూరేట్ ఆఫ్ పొటాష్
ఖరీఫ్
20
100
30
రబి
20
100
30
జీవన ఎరువులు:
కొత్తగా వేరుశనగ సాగుచేయు భూములలో జీవన ఎరువగు రైజోబియం కల్చర్ 200 గ్రా 1 ఎకరము విత్తనమునకు,1గంట ముందు,పట్టించి విత్తవలెను.
భాస్వరము కరగదీయు బాక్టీరియా జీవన ఎరువు కూడ 400గ్రాలు 1ఎకరము విత్తనమునకు పట్టించి విత్తవలెను.