సాలీన వర్షపాతం 650-750మి.లీ వరకు పడే ప్రాంతాల్లో భూమిలో తేమ నిల్వ చేసుకునే శక్తి 100మి.మీ కన్నా ఎక్కువ వుంటే ఆ పొలాలు అంతర పంటలుగా వేసుకోవడానికి అనువైనవి.
అంతర పంటగా వేయడానికి అనువైన పంటను,వంగడాన్ని ఎంపిక చేసుకోవాలి.అంతర పంటగా ఎన్నుకున్న పంటలు వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకుని కొంత దిగుబడి నిచ్చేవిగా ఉండాలి.
అంతర పంట సాగు విధానంలో భాగస్వామ్య పంటలను సరైన నిష్పత్తిలో వేసుకోవాలి.
అంతర పంటలలో,ప్రధాన పంట నుండి దిగుబడి చూడాలి.అంతర పంట నుండి తగ్గకుండా అదనపు దిగుబడి లాభం పొందాలి.
అంతర పంటలు సాగుచేయడం ద్వారా ప్రధాన పైరు మొక్కల మధ్య వున్న స్థలం వృధా కాకుండా ఉపయోగపడునట్టు చేయవచ్చును. స్థలమే కాకుండా సూర్యరశ్మి,నీరు పోషకాలు కూడా బాగా ఉపయోగించుకుంటాయి.
ప్రకృతి వైపరీత్యాల వలన ఒక పైరు దెబ్బతిన్న మరో పైరు ఎంతో కొంత దిగుబడి నిచ్చి రైతును కష్టకాలంలో ఆదుకుంటుంది లేదా రెండు పైర్ల నుండి కూడా అధిక దిగుబడులను పొందవచ్చును.
అంతర పంటలు సాగు విధానం ద్వారా నేలకోత తగ్గుతుంది.
అంతర పంటలు సాగు ద్వారా కీటకాలు ,తెగుళ్ళు,కలుపు మొక్కల బెడద కొంతవరకు తగ్గే అవకాశాలున్నాయి.
అంతర పంటలు అపరాల జాతికి చెందినవైతే,ప్రధాన పంటలకు కొంత మేర నత్రజని అందే అవకాశం వుంది.
అంతర పంటలు సాగు ద్వారా చిరుధాన్యాలు,నూనె గింజలు,పప్పుధాన్యాలు మొదలైన పంటల ఉత్పత్తి పెంచుకోవచ్చును.
అంశం | సాధారణ పద్ధతి | శ్రీ పద్ధతి |
---|---|---|
1 | వేరుశనగ + కంది | 7:1 or 11:1 |
2 | ఆముదం+కంది | 1:1 |
3 | మొక్కుజోన్న +కంది | 2:1 |
4 | జోన్న +కంది | 2:1 |
5 | సజ్జ +కంది | 2:1 |
6 | పెసర/మిరప +కంది | 2:1 |
7 | కంది | 5:1 |
8 | పత్తి+ సోయాచిక్కుడు | 1:1 |
9 | పత్తి +కంది | 1:1 or 2:1 |
10 | ఆముదం+వేరుశనగ | 1:5 |