విత్తనము

విత్తనము రకాలు: ఖరీఫ్

అనుకూలత రకం పంటకాలం(రోజుల్లో)
అత్యల్ప వర్షపాతం వేమన(కె.134),తిరుపతి-2 టి.యం.వి-2 100-105
బెట్ట(300-500 మి.మీ జె.సి.జి-88.తిరుపతి-1 100-105
కొద్దిపాటి నీటి వసతి వేమన,కదిరి-5,టి.యం.వి-2,తిరుపతి-1,4 నారయణి,కాళహస్తి 105-110
కదిరి-3,తిరుపతి-3 115-120
అధిక వర్షపాతం(500 మి.మీ.అంతకన్నా ఎక్కువ) తిరుపతి-3 125-135
కదిరి-3,తిరుపతి-3 105-115
మొవ్వుకుళ్ళు తెగులు కదిరి-3,వేమన 115-120
ఐ.సి.జి.యస్-11,44 120-125
ఆకుమచ్చ తెగులు వేమన,జె.సి.జి_88 105-110
తిరుపతి-3 125-130
కాళహస్తి తెగులు తిరుపతి-3 125-130
(చిట్టికాయ తెగులు) కాళహస్తి,తిరుపతి-2 100-105
వర్షం ఆలస్యమైనపుడు కదిరి-4(కె.150),5,6, నారాయణి 90-100
రబీ
నీటివసతి క్రింద తిరుపతి -2,వేమన,జె.య.ల్-25, కాళహస్తి,జి.జి.-2,కదిరి-6 105-110
తిరుపతి -4,నారాయణి 100-105
కదిరి-3 120-130
కదిరి-4,టి.ఎ.జి-24,టి.జి.26 95-105
ఐ.సి.జి.యస్-11,44,డి.ఆర్.జి-12,17 120-125
వరికోత తర్వాత కదిరి-4,5, టి.ఎ.జి.-24,టి.జి-26 95-100

విత్తన మోతాదు

గింజ బరువు మరియు విత్తే సమయాన్నిబట్టి విత్తన మోతాదు మారుతుంది.


రకం వొలచిన గింజలు(కిలోలు/ఎకరాకు)
ఖరీఫ్ రబీ
జె.య.ల్.24,కదిరి 3,4,6,వేమర, తిరుపతి 3,4నారాయణి,ఐ.సి.జి.యస్.44,కాళహస్తి 60 75
టి.యం.వి 2,తిరుపతి 1,2,కదిరి 5, జి.జి. 2,ఐ.సి.జి.యస్.11,జె.సిజి.88, టి.జి-26,డి.ఆర్.జి-12-17 50 60

విత్తన శుద్ధి చేయుట

రకం గ్రా/కిలో
మా౦కోజెబ్ 3గ్రా/1కిలో విత్తనముకు లేక
కార్బ౦డిజమ్ 1గ్రా/1కి లో విత్తనముకు లేక
ట్రైకోడెర్మావిరిడి 8గ్రా/1కిలో వితనముకు కలిపి విత్తనశుద్ది చేయాలి.


నిద్రావస్థను తొలగించుట:

నిద్రావస్థగల రకాల విత్తనాన్ని 5మి.మీ ఇథరిల్ ను 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణ౦లో 12గంటలు నానబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.



విత్తే దూరం : (సె౦.మీ.లలో)

రకం వర్షాధారపు పంట నీటిపారుదల క్రింద రబీ పంట
గుత్తి రకాలు
వేమన.తిరుపతి 1,2,4,జె.యల్ 24, టి.యం.వి 2,జె.సి.జి 88 30x10 22.5x10
తీగ/పెద్ద గుత్తిరకాలు
ఐ.సి.జి.యస్.11,44 తిరుపతి 3,కదిరి 3 30x15 22.5x15

సకాలంలో సరైన పద్ధతిలో విత్తుట:

  • విత్తనమును 5సె౦.మీ లోతు మించకుండా విత్తవలెను.
  • వర్షాధారముగా ఖరీఫ్ లో గుత్తి రకములకు చ.మీ కు ౩౩,రబీ లో 44 మొక్కలు ఉండవలెను.
  • వర్షాధారముగా ఖరీఫ్ లో తీగ రకములకు చ.మీ కు 22 మొక్కలు ఉండవలెను.

విత్తే సమయం:

ప్రాంతం ఖరీఫ్ రబీ
ఉత్తర కోస్తా జూన్-జూలై నవంబర్1-డిసె౦బర్15
ఉత్తర తెలంగాణ జూన్-జూలై సెప్టెంబర్15-అక్టోబర్15
దక్షిణ తెలంగాణ జూలై-ఆగుష్టు15 అక్టోబర్15- నవంబర్15
రాయలసీమ జూలై-ఆగుష్టు15 నవంబర్15 -డిసె౦బర్15