కంది రకాలు:
రకం- పల్నాడు(ఎల్.ఆర్.జి.30)
లక్షణాలు : మొక్క గుబురుగా పెరిగి కాపు మీద ప్రక్కలకు వాలి పోతుంది.పువ్వులు పసుపు పచ్చగా ఉంటాయి.గింజలు మధ్యస్థ లావుగా గోధుమ రంగులో ఉంటాయి.మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనువైన రకం .రబీకి కూడా అనుకూలం.ఎండు,వెర్రి తెగుళ్ళను తట్టుకోలేదు.
పంటకాలం(రోజుల్లో) : ఖరిఫ్:170-180, రబీ:120-130
దిగుబడి(క్వి/ఎ) : 8.8-10
రకం- మారుతి(ఐ.సి.పి.8863)
లక్షణాలు : మొక్క నిటారుగా పెరుగుతుంది.ఎండు తెగులను తట్టుకొంటుంది.గింజలి మధ్యస్థలాపుగా ఉంటాయి. వారి మాగాణి గట్ల మీద పెంచటానికి అనువైనది.
పంటకాలం(రోజుల్లో) : ఖరిఫ్ 155-160
దిగుబడి(క్వి/ఎ) : 8
రకం- అభయ(ఐ.సి.పి.ఎల్.332)
లక్షణాలు : మొక్కలు నిటారుగా పెరిగి కాయలు గుత్తులుగా కాస్తాయి.గింజలు మధ్యస్థ లావుగా గోధుమ రంగులో వుంటాయి. కాయ తొలుచు పురుగును కొంతవరకు తట్టు కొంటుంది.
పంటకాలం(రోజుల్లో) : ఖరిఫ్:160-165
దిగుబడి(క్వి/ఎ) : 8-8.8
రకం - లక్ష్మి(ఐ.సి.పి.ఎల్.85063)
లక్షణాలు : చెట్లు గుబురుగా వుండి ఎక్కువ కొమ్మలు కలిగి ఉంటాయి.ఎండు తెగులును కొంత వరకు తట్టుకొంటుంది.రబీ లో విత్తినపుడు,ప్రధానమైన కొమ్మలు ఎక్కువగా ఉండి,ఎక్కువ దిగుబడి నిస్తుంది.గింజలు లావుగా ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి.
పంటకాలం(రోజుల్లో) : ఖరిఫ్/రబీ160-180
దిగుబడి(క్వి/ఎ) : 7.2-8
రకం- ఆశ(ఐ.సి.పి.ఎల్.87119)
లక్షణాలు : మొక్క నిటారుగా,గుబురుగా పెరుగుతుంది.ఎండు మరియు వెర్రి తెగుళ్లను తట్టు కొంటుంది.గింజలు ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయి.
పంటకాలం(రోజుల్లో) : ఖరిఫ్:170-180
దిగుబడి(క్వి/ఎ) : 7.2-8
రకం-(హెచ్.వై.3సి)
లక్షణాలు : మొక్క నిటారుగా,గుబురుగా పెరుగుతుంది.ఎండు మరియు వెర్రి తెగుళ్లను తట్టు కొంటుంది.గింజలు ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయిఎర్ర పూత వుండి,కాయలు వెడల్పుగా వుంటాయి.ఖరీఫ్ గింజలు తెలుపు.పచ్చి గింజలను కూరగా ఉపయోగించవచ్చు.
పంటకాలం(రోజుల్లో) : ఖరిఫ్:190-200
దిగుబడి(క్వి/ఎ) : 6.4-7.2
రకం-యం.ఆర్.జి.66
లక్షణాలు : మొక్క నిటారుగా,గుబురుగా పెరుగుతుంది.ఎండు మరియు వెర్రి తెగుళ్లను తట్టు కొంటుంది.గింజలు ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయిఎర్ర పూత వుండి,కాయలు వెడల్పుగా వుంటాయి.ఖరీఫ్ గింజలు తెలుపు.పచ్చి గింజలను కూరగా ఉపయోగించవచ్చు.
పంటకాలం(రోజుల్లో) : ఖరిఫ్:180
దిగుబడి(క్వి/ఎ) : 8.8-9.6
రకం-ఎల్.ఆర్.జి-38
లక్షణాలు : మొక్కలు ఎత్తుగా,గుబురుగా 120-130 రబీ పెరుగుతాయి.పువ్వులు పసుపు పచ్చగా ఉంటాయి. తొలకరి,రబీ కూడా అనుకూలం.
పంటకాలం(రోజుల్లో) : ఖరిఫ్:180, రబీ:120-130
దిగుబడి(క్వి/ఎ) : 8.8-10
రకం-డబ్ల్యు.ఆర్.జి-27
లక్షణాలు : మొక్కలు ఎత్తుగా పెర్గుతాయి.పువ్వులు ఎరుపుగా ఉంటాయి.కాయలు ఆకుపచ్చగా ముదురు గోధుమ రంగు చారలు కలిగి ఉంటాయి.గింజలు గోధుమ వర్ణంలో ఉంటాయి.
పంటకాలం(రోజుల్లో) : ఖరిఫ్:180, రబీ:120-130
దిగుబడి(క్వి/ఎ) : 8-8.8
రకం-దుర్గా
లక్షణాలు : అధిక దిగుబడినిచ్చే స్వల్ప కాలిక రకం,కాయతొలుచు పురుగు బారి నుండి తప్పించుకొంటు౦ది.ఉత్తర తెలంగాణా జిల్లాలకు ఖరిఫ్ పంటగా అనువైనది.
పంటకాలం(రోజుల్లో) : ఖరిఫ్:115-125
దిగుబడి(క్వి/ఎ) : 4.8-6
రకం-పి.ఆర్.జి-100
లక్షణాలు : ఎండు తెగులును కొంత వరకు తట్టుకొంటుంది.తెలంగాణా మరియు రాయల సీమలోని తేలిక పాటి,ఎర్ర చల్కా నేలల్లో వర్షాధారంగా సాగుచేయటానికి అనువైనది.
పంటకాలం(రోజుల్లో) : ఖరిఫ్:145-150
దిగుబడి(క్వి/ఎ) : 8