విత్తనము

విత్తన మోతాదు

  • ఖరీఫ్ లో సహపంటగా 2-3 కిలోలు
  • రబీలో ఎకపంటగా/సహపంటగా 6-8కిలోలు

అంతర పంటల నిష్పత్తి

  • కంది:వేరుశనగ (1:7)1.5కిలోలు ఎకరాకు
  • కంది:మొక్కజొన్న(1:2)2-3కిలోలు ఎకరాకు

విత్తే సమయ౦

ఖరిఫ్ లో ఉత్తర తెలంగాణా,దక్షిణ తెలంగాణా మరియు తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ లోను;కృష్ణా-గోదావరి,దక్షిణ మండలం మరియు ఉత్తర కొస్తా మండలాల్లో జూన్-జూలై నెలల్లోను;రబీలో ఉత్తర,దక్షిణ తెలంగాణాల్లో సెప్టెంబరు లోను,కృష్ణా-గోదావరి,దక్షిణ మండలం,ఉత్తర కొస్తా మండలాల్లో సెప్టెంబరు-అక్టోబరు నెలల్లోను విత్తుకోవచ్చు.


విత్తన శుద్ధి

రైజోబియంను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడిని పొందవచ్చు.


విత్తే పద్ధతి

నాగలి వెంబడి గాని ,సాళ్లలో గోర్రుతో గాని విత్తుకోవాలి.

విత్తే దూరం

ఖరిఫ్ లో నల్ల రేగడి నేలల్లో 150X12లేదా 180X10సెం.మీ(వరసుల మధ్య మొక్కల మధ్య),ఎర్ర నేలల్లో 90X20 సెం.మీ రబీలో వర్షాధారంగా 45-60X10,ఆరుతడి పంటగా 75-90X10సెం.మీ.