ఇతర విషయాలు
పంట కొత్త నిల్వ
అన్ని కాయలు ఎండిన తర్వాతనే కంది పంటను కోయాలి.ఎందుకనగా,పూత 2నెలల వరకు పూస్తూనే వుంటుంది.ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి కాయల నుండి గి౦జవేరు చేయాలి.క౦దులను బూడిద కలిపి గాని,వేప ఆకులు కలిపి గాని నిల్వ చేస్తారు.నిల్వ చేసేటప్పుడు పురుగులు ఆశించకుండా ఉండేందుకు బాగా ఎండ బెట్టాలి.
పంటకు ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు
- పంట చేలల్లో గల పైరుకు చెందిన చెత్తను,మొదళ్ళను పూర్తిగా తీసివేయాలి.వేసవి కాలంలో లోతుగా దుక్కులు చేయాలి.
- తప్పనసరిగా పంట మార్పిడి పాటి౦చాలి.
- పురుగు/తెగుళ్ళను తట్టుకొను శక్తి కలిగిన నాణ్యమైన వంగడాలను ఎంపిక చేసుకోవాలి.ఐ.సి.పి.ఎల్-332(శనగ పచ్చ పురుగు)ఐ.సి.పి.ఎల్.-84031,85063(ఎండుతెగులుకు)రకాలను వాడాలి.దీనివల్ల మొక్కలు ఆరోగ్యవంతముగా పెరుగుతాయి.శనగపచ్చ పురుగు ,కాయ ,ఈగ,ఆకుచుట్టు పురుగు,కాయకొట్టు పురుగు (ఫ్లుమ్ మాత్)నివారించుట కయ్యే పురుగు మందులు ఆదా అవుతాయి.అంతేగాక మిత్ర పురుగులు వృద్ధి కావడానికి అవకాశ౦ కలుగుతుంది.
- విత్తన శుద్ధి పాటించాలి.
- ఎకరమునకు సుమారు 5బండ్ల పశువుల ఎరువు వాడినచో భూమి భౌతిక శక్తిని పెంచి భూసారాన్ని దీర్గకాలం కాపాడి సూక్ష్మ ధాతులోపాన్ని సవరించును.భూసార పరీక్ష చేయించి,సిఫారసు మేరకు నత్రజని,భాస్వరము దుక్కిలో వేయాలి.భాస్వరాన్ని ఎస్.ఎస్.పి రూపంలో అందించినచో మొక్కకు గంధకము కూడా అంది దిగుబడి 20-25శాతము పెరుగును.
- కందిలో అంతర(మిశ్రమ)పంటలు వేయాలి.ముందుగా ఆ పంటల గూర్చి మీరు ఆలోచించాలి.
పంటకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- పంట కాలంలో నీటి,రసాయనిక ఎరువుల యాజమాన్యాన్ని పాటించాలి.
- సకాలంలో అంతర కృషి పాటించాలి.
- వాతావరణ మార్పులు,శత్రు మిత్ర పురుగుల ఉనికిని ప్రతివారం గమనించాలి.ఉదా:ఎకరాకు 10మొక్కలపై ఉన్న శత్రు మిత్ర పురుగులను గుర్తించి లెక్కించి 2:1నిష్పత్తిలో లేని ఎడల కూడా ఎలాంటి రసాయనక క్రిమిసంహారక మందులు పిచికారి చేయవలసిన అవసరం లేదు.
- ఎకరమునకు 4-5లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి.
- ఆర్ధిక నష్ట పరిమితి స్థాయి: శనగపచ్చ పురుగు ప్రతి లింగాకర్షక బుట్టలో రాత్రి 5-మగ పురుగులు (చిలకలు) పడిన ఎడల
- ఆర్ధిక నష్ట పరిమితి స్థాయి దాటిన తరువాత పురుగు దశ ,వాతావరణం,విత్తన రకం,మిత్ర పురుగులు,మార్కెట్ ధరను పరిగణనలోనికి తీసుకొని అవసరం మేరకు తగు చర్యులు తీసుకొనవలెను.
- ఎకరమునకు 6ప౦గల కర్రలను(పక్షి స్థావరములను)ఏర్పాటు చేసిన ఎడల గ్రామ సీమలలో ఎప్పుడూ కనిపించే కొంగలు,నల్లంచి పిట్టలు గోరువంక, కాకులు మొదలైన పక్షులు పంగల కర్రలపై వాళి హాని చేయు పురుగులను వేటాడి తింటాయి.
- శనగపచ్చ పురుగు వివిధ దశలలో గ్రుడ్లు,గొంగళి పురుగులను చేతితో ఏరి నాశనము చేయవలెను.ముఖ్య౦గా చెట్లను దులుపుట వలన ఎదిగిన గొంగళి పురుగులను ఏరి నాశనము చేయవలెను.
- పురుగు సోకిన భాగాలను ఏరి నాశనము చేయవలెను.