ఆంధ్రప్రదేశ్ లో చెఱకు షుమారు 5.60 లక్షల ఎకరాల్లో సాగుచేయబడుతూ, 160 లక్షల టన్నుల ఉత్పత్తినిస్తుంది.చెఱకు పంట ద్వారా పంచదార ,బెల్లం, ఖండసారి ,మొలాసిన్ , ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతున్నాయి. అధిక చెఱకు దిగుబడి,రసంలో ఎక్కువ పంచదార పొందటానికి ప్రధానంగా శీతోష్ణ స్థితులు, రకం,సాగుభూమి , సాగు పద్ధతులు , సస్యరక్షణ , సాగునీటి నాణ్యత అనే ఆరు అంశాలు ప్రభావితం చేస్తాయి .