పీక పురుగు ,కా౦డ౦తోలుచు పురుగు:

చెఱకు నాటిన నుండి .చెఱకు నరికే వరకు ఈపురుగు పైరును ఆశించి ,బాల్య౦ దశలో పీకపురుగుగా,కాండం ఏర్పడిన తర్వాత కా౦డ౦ తోలుచుపురుగుగా చెఱకు పైరును నష్టప్రుస్తంది.పీక పురుగు తాకిడి వర్షధారపు చెఱకు పై ఎక్కువగా వస్తుంది .లోత్తేనా కాలువల్లో ముచ్చెలను నాటాలి. లి౦డ్న్ పొడిమ౦దు ఎకరాకు 10 కిలోల చొప్పున 2:3:4 నిష్పత్తిలో నటిన 0,30 మరియు 60 రోజుల్లో వెయాలి. వీల్తేనంత తక్కువ వవ్యధిలో దగ్గర దగ్గరగా నీటితడులివ్వాలి. మొక్క తోటల్లో, నాటిన మూడవ రోజున,కార్శి తోటల్లో కార్శి చేసిన వెంటనే ఎకరాకు 1.25 టన్నుల చొప్పున చెఱకు చెత్త కప్పాలి.ఎందోసల్ఫాన్2.మి.లి.లీటరు నీటికి కలిపి నాటిన4,6 మరియు 9 వారాల్లో పిచికారి చేసుకోవాలి. ట్త్రికోగ్రామా ఖిలోనిన్ గ్రుడ్డు పరాన్నజీవిని ఎకరాకు20,000 చొప్పున చెఱకు నాటిన 30 రోజులవవ్యధి లో 4 సార్లు విడుదల చేయాలి.


పొలుసు పురుగు:

కణుపు ఏర్పడినప్పటినుంచి,చెఱకు నరికే వరకు పొలుసు పురుగు పైరు నాశిస్తుంది.నీటి ఎద్దడి పరిస్థితుల్లో ఎక్కువగా నష్టం కల్గిస్తుంది.విత్తనపు దవ్వను పొలుసు పురుగు ఆశించని తోటలనుంచి సేకరించాలే లేదా డైమిధోయేట్ 1.7 మి.లీ లీటరు నీటి మోతాదులో కలిపిన ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటాలి.పొలుసు పురుగు వ్యాప్తి అరికట్టటానికి ఆకులు రెలచి(మొవ్వు కనీసం 8ఆకులు ఉంచి) డైమిధోయేట్ 1.7మి.లీ లేక మలాధియన్ 3.0 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.


తెల్ల నల్లి:

పురుగులు ఆకుల అడుగుభాగాన అంటుకొని ఆకుల్లో రసాన్ని పీల్చి వేయటం వలన పైరు పెరుగుదల తగ్గిపోతుంది.ఆకులు నారింజ రంగుగా మారి మొక్కలు గిడసబారి పోతాయి.నీటిముంపుకు గురైన,ఇవక తీత సౌకర్యంలేని,సిఫారసు మేరకు ఎరువు వేయలేని పొలాల్లోను,కార్షి తోటల్లోను తెల్లనల్లి ఎక్కువగా వస్తుంది.ఎండోసల్ఫాన్ 2మి.లీ లీటరు నీటికి కలిపి రెండుసార్లు 10-12 రోజుల వ్యవధి లో అవసరాన్ని బట్టి ఆకుల క్రింద,పైభాగాలు తడిచేలా పిచికారి చేయాలి.

పిండినల్లి:

పురుగులు ఆకు తోదిమలకు ,చెఱకు గడలకు మధ్య గుంపులు గుంపులుగా చేరి గదల నుండి రసాన్ని పీల్చి వేస్తాయి.పంట పక్వానికి వచ్చునపుడు పిండినల్లి తారిడి ఎక్కువగా ఉంటుంది.ఉధృతంగా ఉన్నపుడు మొవ్వు ఎండిపోతుంది.విత్తనపు దవ్వను నాటటానికి ముందు లీటరు నీటికి మలాథియాన్ 2మి.లీ లేదా డైమిధోయేట్ 1.7 మి.లీ కలిపిన మందు ద్రావణంలో 15నిమిషాలు ముంచి నాటుకోవాలి.ఎదిగిన తోటల్లో పురుగు నివారణకు ఆకుల రేలచి ,బహిర్గతంగా కణుపుల మీద మలాథియాన్ 3మి.లీ లేదా డైమిధోయేట్ 1.7మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.


దూదేకుల పురుగు:

పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చి వేయటం వలన ఆకులు వడలిపోయి ఎండిపోతాయి.పురుగు ఆశించిన చెఱకు నుండి తయారుచేసిన బెల్లం నల్లగాను,మేత్తగాను ఉండి ,నిల్వకు పనికిరాదు .ఎండోసల్ఫాన్ 2మి.లీ లేక మాలాథియాన్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేసి పురుగును నివారించుకోవచ్చు.


వేరు లద్దె పురుగు:

వేరు లద్దె పురుగు తేలిక నేలల్లో ఎక్కువగా కనిపించి మొక్కల వెళ్ళను తినివేయటం వలన మొక్కలు చనిపోతాయి.ఎకరాకు 8-10కిలోల చొప్పున ఫోరేట్ 10శాతం గుళికలను నాటే సమయంలో భూమిలో వేసి పురుగు వలన కలిగే నష్టాన్నితగ్గించుకోవచ్చు.ఎదిగే తోటల్లో ఈ పరుగు నివారణకు ఫోరేట్10శాతం గుళికలు ఎకరాకు 8కిలోలు మొక్కల మొదళ్ళ దగ్గరగాగుంతలు చేసి వేయాలి.


నైలు(మైట్లు) (లక్క తెగులు):

వేసవి కాలంలో వాన జల్లులు పడినప్పుడు,ఆ జల్లులు మధ్య ఒరుపు సమయంలో లక్క తెగులు ఎక్కువగా కన్పిస్తుంది.ఆకు అడుగు భాగాన అసంఖ్యాకంగా ఈ పురుగులు చేరి రసాన్ని పీల్చడం వలన ,ఆకు ఎర్రగా మారుతుంది .నివారణకు లీటరు నీటికి 3గ్రా.ల నీటిలో కరిగే గంధకపు పొడిని కలిపి ఆకుల అడుగు భాగ౦ తదిచేటట్లు పిచికారి చేయాలి.


పసుపు నల్లి:

ఈ నల్లులు ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా 6నుండి 8 వరుసలలో ఆకు మధ్య ఈనెకు సమాంతరంగా తెల్లటి గూళ్ళను చేసి,వాటి లోపల ఉంటాయి.ఇవి ఆకుల అడుగు భాగాన్ని గీకి రసం పీల్చటం వలన పసుపు పచ్చని అండాకారపు మచ్చలు ఏర్పడతాయి.క్రమేపి ఈ మచ్చలు ఎరుపురంగుకు మారుతాయి.ఈ నల్లి ముదురు ఆకులను ఎక్కువగా ఆశిస్తుంది.ఇవి చెఱకు ఆకులనుండి రసాన్నిపీల్చటం వలన ఆకులన్ని పాలిపోయి చివరకు ఎండిపోతాయి.ఇవి ఆశించిన తోటల్లో ఎదుగుదల తగ్గి ,దిగుబడి తగ్గుతుంది.ఈ నల్లి ఉధృతి ఏప్రిల్ నెల అక్టోబర్ వరకు ఉంటుంది.మధ్యస్థ ఉష్ణోగ్రతలు 26 నుండి 29 సెల్సియస్ మరియు మధ్యస్థమైన గాలిలోని తేమ 60 నుండి 75 శాతం ఈనల్లి ఉధృతిని అనుకూలం ఈ నల్లి ఆశించిన క్రింది ఆకులను (మొవ్వ 8ఆకుల మినహా)తీసి తగలబెట్టాలి. నీటిలో కరిగే గంధకపు పొడి లీటరు నీటికి 3గ్రాములు చొప్పున కలిపి ఆకుల అడుగు భాగం తడిచేటట్లు పిచికారి చెయ్యాలి.అవసరాన్ని బట్టి 15రోజుల వ్యవధిలో మరోసారి పిచికారి చేయాలి.ఈ నల్లి ,గడ్డి జాతి మొక్కల పై కూడా ఆశిస్తుంది.కాబట్టి పొలం చుట్టూ ఉన్న గడ్డిజాతి మొక్కల మందు పిచికారి చేయాలి.


తెల్ల పేను(ఊలి ఎఫిడ్):

ఈ పురుగు యొక్క తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులుగా ఉండి,రసాన్ని పీల్చటం వలన తెలుపు,పసుపు వర్ణం మిళితమైన మచ్చలు ఏర్పడతాయి.మొదటి అంచులు తర్వాత మొత్తం ఆకుల క్రమేపి ఎండిపోతాయి.ఈ పురుగులు విసర్జించిన తియ్యని జిగుటు పదార్ధం క్రిందనున్నఆకుల పై భాగాన పడి ,దాని మీద సూటిమోల్ట్ అనే నల్లని శిలీంధ్రం పెరిగి ఆకు మసిబారుతుంది.పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు చెఱకు దిగుబడి 26శాతం ,పంచదారదిగుబడులు 24శాతం తగ్గిపోతాయి.వాతావరణ౦ మబ్బుగా ఉండి,19 నుండి 35 సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ,అరియు 80 నుండి90 శాతం గాలిలో తేమ ఉన్నప్పుడు పురుగు బాగా అభివృద్ధి చెందుతుంది. గాలి ద్వారా 1.5నుండి 2.0 కి.మీ దూరం వరకు ఈ పురుగులు వ్యాప్తి చెందగలవు.విత్తనాన్ని ఆరోగ్యవంతమైన తోటల నుండే సేకరించాలి.విత్తనపు ముచ్చెలను మలాధియాన్ 3మి.లీ కలిపినా మందు ద్రావణంలో 15నిమిషాలు ముంచి నాటాలి.సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువులు వాడాలి.పురుగు ఆశించిన ఆకులను తీసి తగలపెట్టాలి.పురుగు ఆశించిన తోటల నుండి చెఱకును ఇతర ప్రాంతాలకు రవాణా చేయకూడదు.డిఫా(కోనోబాత్రా)ఎఫిడివోరా.మెక్రోమాప్ సిర్పిడి వంటి బదనికలు వాడాలి.లీటరు నీటికి మలాధియాన్ 2మి.లీ లేదా ఎండోసల్ఫాన్ 2మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ లేదా డైమిదోయేట్ 1.7మి.లీ లేదా మిథైల్ డేమిటాన్ 2మి.లీ లేదా ఎసిఫేట్ 1గ్రా మోతాదులో కలిపి పిచికారి చేయాలి.