చెరుకు విత్తనం ఎంపిక :

పూత పూయని చెఱకు చిగురు భాగంగాని, 7-8 నెలల వయస్సు గల లేవడి తోటల చెఱకును గాని మూడు కళ్ళ ముచ్చెలుగా కొట్టి వీత్తనంగా వాడాలి . లేవడి తోటలను పెంచేందుకు ముదురు తోగుల నుంచి సేకరించిన గడలను (మొదలు , చివర 1/3 భాగాలకు తీసివేసి) మూడు కళ్ళ ముచ్చెలుగా చేసి , వేడి నీటిలో (52 సెల్సియస్ వద్ద 30 నిముషాలు ) లేదా తేమతో మిళితమైన వేడి గాలి (54 సెల్సియస్ వద్ద 4 గంటలు ) విత్తన శుద్ధి చేయాలి . వేడి నీటి విత్తన శుద్ధి ద్వారా కాటుక , గడ్డిదుబ్బ , ఆకుమాడు తేగుళ్ళను అరికట్టవచ్చు .


విత్తన శుద్ధి :

ఎకరానికి 16,000 ముడుకళ్ళ ముచ్చేలను 300 లీటర్ల నీటికి 150 గ్రాముల కార్బండిజం మరియు 600 మీ.లీ. మలాథియన్ కలిపిన ద్రావణంలో 15 నిమిషాలు ఉంచి నాటినట్లైతే పొలుసు పురుగు , అనాసకుళ్ళును అరికట్టవచ్చు . ముచ్చేలను వేడి నీటిలో (52 సెల్సియస్ వద్ద 30 నిముషాలు ) లేదా తేమతో మిళితమైన వేడి గాలి (54 సెల్సియస్ వద్ద 4 గంటలు ) విత్తన శుద్ధి చేయాలి . వేడి నీటి విత్తన శుద్ధి ద్వారా కాటుక , గడ్డిదుబ్బ , ఆకుమాడు తేగుళ్ళను అరికట్టవచ్చు .


నాటే సమయం :

కోస్తా ఆంధ్రా లో జనవరి - మార్చి మాసాల్లో , తెలంగాణాలోని ఎక్సాలి పంటను డిసంబర్ - జనవరిలో , ఆడాల్సి ఆగష్టు - సెప్టెంబర్లోను, రాయలసీమ ప్రాంతంలో జనవరి - ఫెబ్రవరిలోను నాటుకోవచ్చు. ముందుగా ఆడుటకు ( నవంబరు - జనవరి ), మధ్యకాలంలో ఆడుటకు (ఫెబ్రవరి - మార్చి), ఆలస్యంగా ఆడుటకు (మార్చి - మే) అనువైన రకాలను క్రమంగా జనవరి,ఫిబ్రవరి,మార్చి మాసాల్లో నాటుకోవాలి .


నాటే విధానం :

చాళ్ళలో నీరు పెట్టి,నీరు భూమిలో ఇంకిన తర్వాత వెనుకకు నడచుకుంటూ , అన్ని కళ్ళ ప్రక్కలకు ఉండేటట్లు 25సెం .మీ లోతు మించకుండా నాటాలి .


నాటే దూరం :

నేలను 25-30 సెం .మీ లోతు వరకు ఇనుప నాగలితో దున్ని మెత్తటి దుక్కి చేయాలి . 4-6 వారాలకు ముందు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదా 5 టన్నుల బాగా ఆరిన పొడి ఫిల్టర్ మడ్డి వేసి కలియ దున్నాలి . చదును చేసిన తరవాత కాలువలను, బోదెలను రిడ్జ్మార్ లేదా రెక్కల నాగలితో వేసుకోవాలి. కాలువ వెడల్పు 30 సెం .మీ లోతు 20 సెం .మీ వుండాలి . చాళ్ళ మద్య స్వల్పకాలిక రకాలకు 80 సెం .మీ మద్యకాలిక రకాలకు 90 సెం .మీ ఆలస్యంగా వర్షాధారంగా నాటే చెఱకు కు 60 సెం .మీ ఎడం ఉండాలి .