చెరుకు రకాలు

నీటిపారుదల క్రింద :

కొ6907 , 81ఎ99 , 83ఎ99 , 83ఎ30 , 84ఎ125 , 85ఎ261 , 86వి96 , 83ఆర్23 , 87ఎ298 , 91వి83 , 93ఎ145 , కో.ఎ.7602 , కో.టి.8201 , 7805 , 83వి15 , కో7219 , కో.ఆర్.8001 , కో7706


వర్షాధారపు పరిస్థుతులకు అనువైన రకాలు.

జనవరి - ఫిబ్రవరిలో నాటటానికి

కో6907 , కో.టి.8201 , కో.ఎ.7602 , కో7219 , 81ఎ99 , 85ఎ261 , 83ఎ30, 84ఎ125 , 90ఎ272 , 83వి15 , 85ఆర్186 , 83ఆర్23 , 87ఎ298 , 93ఎ145 , 91వి83


మే-జూన్ నేలలో నాటటానికి:

కొ6907 , కో.టి.8201 , 85ఎ261 , 81ఎ99 , 81వి48 , 84ఎ125 , 83ఎ30 90ఎ272 , 83ఆర్23 , 87ఎ298 , 93ఎ145 .


చౌడుభుములకు:

81ఎ99 , 81వి48 , కో7219 , కో.టి.8201 , 93ఎ145 .


సూక్ష్మధాతు లోపాలు:

ఇనుప ధాతు లోప నివారణ:


సున్నం అధికంగా ఉండే తూర్పు , పశ్చిమ గోదావరి , చిత్తూరు, నిజామాబాద్ జిల్లాల్లో ఇనుప ధాతు లోప నివారణకు ఎకరాకు 2 కిలోల అన్నభేది 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మిద పిచికారి చేయాలి .

మాంగనీసు ధాతు లోప నివారణ :


మాంగనీసు లోపం మెదక్ జిల్లాల్లో కొన్ని చోట్ల కనిపించింది . మాంగనీసు లోపం చెఱకు మద్య ఆకుల్లో, పాలిపోయిన పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలుగా ఈ నెల ప్రక్కన కనబడ్తుంది . ఈ నెల మద్య తెల్లగా మారిన ఆకుభాగాల్లో కుళ్ళు మచ్చలు వచ్చి,అవి పెద్దవై , ఒక దానితో ఒకటి కలిసి పోయి,చారలు చారలుగా ఆకు నిలువునా చిల్చినట్లు కనబడతాయి. మాంగనీసు ధాతు లోప నివారణకు ఎకరాకు 2.5 కిలోల మాంగనీసు సల్ఫేట్ 450 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.