పంట మొదటి నాలుగు నెలల్లో (బాల్యదశ) ఆరు రోజులకొకసారి , పక్వదశలో (నవంబరు నుండి చెఱకు నరికే వరకు) మూడు వారాలకొకసారి నీరు పెట్టాలి. బిందు సేద్యపద్దతి అవలంభించడం వలన పరిమిత నీటి వనరులను పొదుపుగా వాడుకొవచ్చును .జంట పాళ్ళ పద్దతిలో (2.5*3.5) చెఱకు సాగు చేసినప్పుడు, బిందు సేద్యపద్దతి లో ఖర్చును తగిన్చుకోవచ్చును. నీటి ఎద్దడి పరిస్థితుల్లో చెఱకు నాటిన 3 వ రోజు ఎకరాకు 1.25 టన్నుల చొప్పున చెఱకు చెత్త కప్పటం ద్వారా భూమిలోని తేమ త్వరగా కోల్పోకుండా నివారించడంలో బాటు కలుపు , పీక పురుగుల ఉదృతి తగ్గించవచ్చు . ఈ పరిస్థితుల్లో యూరియా, మ్యురేట్ ఆఫ్ పోటాష్ (2.5 శాతము ) ను పైరు మీద పిచికారి చేయాలి . చెరువుల క్రింద వర్షాధారంగా సాగుచేసినపుడు , చెఱకు తోటకు బాల్య దశలో మొదటి తడిపెట్టిన 30 రోజులకు రెండవ తడిని పెట్టడం మంచిది . వర్షాకాలంలో తోటల్లో నీరు నిల్వకుండా చూడాలి. మురుగునీటి కాల్వల ద్వారా గాని , నత్తగుల్ల లేదా ఆర్కిమెడిస్ స్క్రు ద్వారా గాని నీటిని త్వరగా తీసివేయాలి . సాగునిటిలో లవణాల సాంద్రత అధికంగా ఉన్నపుడు (2 మి.ల్లీ మోస్లు సెం.మి.కు) మరియు సోడియం కార్బోనేట్ అవశేషం లీటరు కు 5 మి.ల్లీ ఈక్వివలెంట్ల కన్నా అధికంగా ఉన్నపుడు పంచదార దిగుబడులు రసనాణ్యత తగ్గుతాయి .