రకాలు:
మొక్కతోతల కన్నా కార్శితోటలు త్వరగా పక్వానికి వస్తాయి.సాగులో ఖర్చు తక్కువ .మొక్క తోటలకంటే కార్శితోటలు మొదటి రోజుల్లో నీటి ఎద్దడి తట్టుకొంటాయి.పూతకురాని,తెగుల్లను తట్టుకొనే రకాలనుంచి కార్షి తోటలను సాగుచేయుట లాభాదాకం.కో 6907,కో8014,84ఎ125,81ఎ99,81వి48,85ఎ261,కోటి 8201,కోఎ7602,కో8021,86ఎ146,83ఆర్23,87ఎ298,83వి15,83వి288,86వి96 రకాలు మంచి కార్శితోటలనిస్తాయి.కార్షితోటల్లో దుబ్బులు మొలకేత్తేటప్పుడు కలుపు మందులను వాడరాదు.ల్తైన కాలవల్లో నాటిన మొక్క తోటలనుండి పెంచిన కార్షితోటలు అధిక దిగుబడులునిస్తాయి.పొలంలో పదును తక్కువగా ఉన్నప్పుడు,దుప్పులు కదలకుండా పదునైన పారలతో వరుసలలో ని మోళ్ళను చేక్కినపుడు భూమిలోపలి కణువులనుండి పిలకలు వస్తాయి.అవి సామాన్య గాలులకు పడిపోవు.
వరుసలలో 50సెం.మీ మించి ఖాళిలు వున్నపుడు,ఆరువారాల వయస్సుగల అదే రకపు (పాలిధీన్ సంచుల్లో పెంచిన)మొలకలతో ఖాళీలను నింపుకోవాలి.వరుసల మధ్య 15సెం.మీ లోతు దుక్కి చేయట౦ ద్వారా నేల పై చల్లిన్ చఱుకు చెత్త నేలలో కలపడమే కాకుండా మొదళ్ళ వద్దనున్న పాత వేర్లు తెగి ,క్రొత్త వేర్లు వచ్చి నీటిని ,పోషకాలను బాగా తీసికోనేందుకు అవకాశముంటుంది.
ఆయా ప్రాంతాలకు మొక్క తోటకు సిఫార్సు చేసిన నత్రజని కన్నా,అదనంగా ఎకరాకు 45 కిలోలు రెండు దఫాలుగా మోళ్ళు చెక్కిన వెంటనే ఒకసారి,45 రోజులకు మరోసారి వేయాలి.కార్షి చేసిన వెంటనే వరుసల మధ్య ఎకరాకు 1.25టన్నుల చెఱుకు చెత్తను కప్పి ,1.25కిలోల కుళ్ళబెట్టే శిలీంద్ర పొడిని (ఆస్పరిజిల్లస్ ఫ్లామ్=నిస్,పెన్సీలియం క్రిసోజీలం,కోచిలోబోలస్ స్పైసిఫెర్,రైజోపస్ ఒరైజే మరియు ట్రైకోడేర్మా విరిడి)పేడ నీళ్ళలో కలిపి చల్లాలి.
-దీనితో' సహా 10కిలోల సూపరఫాస్పైట్,8కిలోల యూరియా కూడా చల్లితే ,భూమిలో తేమ నిలబడడమే కాకుండా చెత్త కప్పాలి.ఇనుప ధాతు లోపనివారణకు రెండు శాతం అన్నభేది ఎకరాకు 2కిలో 200 లీటర్లు నీటిలో కలిపి పైరు 45-60రోజుల వయస్సు ఉన్నపుడు రెండుసార్లు పిచికారి చేయాలి. ఎక్కువ పంచదార లేక బెల్లం పొందటానికి కార్శితోటలను 9-10 నెలలు పైబడినపుడు మాత్రమే నరకాలి.
మోళ్ళను చెక్కడం:
కార్షి తోటలో మోళ్ళను చెక్కడం:
పొలంలో పదును తక్కువగా ఉన్నప్పుడు,దుప్పులు కదలకుండా పదునైన పారలతో వరుసలలోని మోళ్ళను చేక్కినపుడు భూమిలోపలి కణుపుల నుండి పిలకలు వస్తాయి.
చెత్త కప్పడం:
1.కార్షి చేసిన వెంటనే వరుసల మధ్య ఎకరాకు 1.25 కిలోల కుళ్ళబెట్టే శిలీంద్రాల పొడిని(ఆస్పరిజిల్లస్ ప్లానిస్,పెన్సీలియం క్రిసోజీలం,కోచిలోబోలస్ స్పైసిఫెర్,రైజోపస్ ఒరైజె మరియు ట్రైకోడేర్మా విరిడి)పేడ నీళ్ళలో కలిపి చల్లాలి.
2.దీనితో సహా10కిలోల సూపర్ ఫాస్పైట్,8కిలోల యూరియా కూడా చల్లితే,భూమిలో తేమ నిలబడడమే కాకుండా చెత్త బాగా చివికి ఎరువుగా ఉపయోగపడుతుంది.కలుపు మొక్కలు,పీక పురుగు వ్యాప్తి తగ్గుతుంది.
ఖాళీల నింపడం:
కార్షి తోటలో ఖాళీలను నింపడం:
వరుసలలో 50సెం.మీ మించి ఖాళీలు వున్నప్పుడు ,ఆరు వారాల వయస్సుగల అదే రకపు(పాలిధీన్ సంచుల్లో పెంచిన)మొలకలతో ఖాళీలను నింపుకోవాలి.
ఎరువులు:
కార్షి తోటలలో ఎరువులు:
ఆయా ప్రాంతాలకు మొక్క తోటకు సిఫార్సు చేసిన నత్రజని కన్నా,అదనంగా ఎకరాకు 45కిలోలు రెండు దఫాలుగా మోళ్ళు చెక్కిన వెంటనే ఒకసారి ,45 రోజులకు మరోసారి వేయాలి.
అంతర కృషి:
వరుసల మధ్య 15 సెం.మీ లోతు దుక్కి చేయటం ద్వారా నెల పై చల్లిన చెఱకు చెత్త నేలలో కలపడమే కాకుండా మొదళ్ళ వద్దనున్న పాత వేర్లు తెగి,క్రొత్త వేర్లు వచ్చి నీటిని ,పోషకాలను బాగా తీసికోనేందుకు అవకాశముంటుంది.ఎక్కువ పంచదార లేకబెల్లం పొందటానికి కార్శితోటలను 9-10నెలలు పైబడినప్పుడు మాత్రమే నరకాలి.