నీటి సదుపాయం ఉన్న మెరక భూములు (తోట భూములు )మిక్కిలి అనువైనవి. తేమను పోషకాలను ఎక్కువగా నిలుపుకోలేని తెలికనేలలను (ఇసుక నేలలు ) సేంద్రియ పదార్ధాలు (ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేక 5 టన్నుల ఫిల్టర్ మడ్డి )వేసి అభివృధి పరచి చెఱకు నాటు కోవాలి .సారహినమైన, లోతు తక్కువ కలిగి నేల పైపోరా గట్టి పడే భూము లను లోతైన దుక్కిచేసి ఎకరాకు 1 టన్ను పొడిగా చేసిన వేరుసెనగ తొక్కలను లేక వారి ఊక వేసి అభివృద్ధి పరచుకోవాలి . పాల చౌడభూముల్లో చెఱకు నాటేటపుడు , ముందుగా లవణాలను మురుగు నీటి కలవ ద్వారా తిసివేయాలి . లవణ పరిమితి నేలలో సెంటి మిటరుకు 2 మీలీ మోస్ లకన్నా ఎక్కువ ఉండకూడదు . క్షారభుములకు జిప్సం వేసి అభివృధి పరచి నాటుకోవాలి . రేగుర్ నేలలో (నిజామాబాదు ) మరియు చల్క భూముల్లో 45 సెం.మీ. వరకు లోతు దుక్కి చేస్తే వేళ్ళ వ్యాప్తి బాగా ఉంటుంది.