బెల్లం తయారీ:
బెల్లం తయారీలో మెళుకువలు:
బాగా పక్వానికోచ్చిన చెఱకునే బెల్లం తయారీకి ఉపయోగించాలి.చెఱకును భూమట్టానికి నరికి,వెంటనే గానుగాడి బెల్లం చేసుకోవాలి.చచ్చిన,ఎలుకలు కొట్టిన,గాలి పెడలతో వచ్చిన పిలక వంటి చెఱకులను ఏరివేసి,మంచి చెఱకులనే ఉపయోగించి,బెల్లం చేయాలి.అనివార్య పరిస్థితుల్లో,వెంటనే బెల్లం చేయలేకపోయినప్పుడు,చెఱకు మోపులను నీడలో గుట్టలుగా ఉంచి ,చెఱకు చెత్త కప్పి,పలచగా నీరు చల్లితే చెఱకు తూకం,రస నాణ్యత తరుగుదల తక్కువ గా ఉంటుంది. తక్కువ శక్తితో, ఎక్కువ రసపు దిగుబడికి గానుగల సామర్ధ్యం పెంచే౦దుకు నిలుపు క్రషర్ల కంటే ,అడ్డు క్రషర్లు ఉపయోగించటం మంచిది.