ఆంధ్రప్రదేశ్ లో రాగి 1.65 లక్షల ఎకరాల్లో సాగుచేయబడుతూ 79 వేల టన్నుల ఉత్పత్తినిస్తుంది.సరాసరి దిగుబడి ఎకరాకు 5.0 క్వింటాళ్ళు వస్తుంది. నేలలు: రాగిని తేలిక రకం ఇసుక నేలలయందు మరియు బరువు నెలల్లో పండించవచ్చు. నీరు నిల్వ ఉండే భూములు అనువైనవికావు.