పంటకోత

రాగి పంటను సరైన సమయంలో కోతను ప్రారంభించాలి . గింజలు ముదురు గోధుమ రంగులో ఉన్నపూడు, వెన్నుకు దగ్గరి ఆకులు పండినట్లుగా ఉన్నపుడు పంటను కోయవచ్చు. పిలక కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తుంది.కాబట్టి 2 లేక 3 దశల్లో కంకులను కోయాలి . పొలంలోనే చొప్పున కోసి 2-3 రోజులు ఆరిన తరువాత వెన్నులను విడదియవచ్చు లేదా నేరుగా చొప్పున కోయకుండా వెన్నులను కోసి 2-3 రోజులు పొలంలో ఆరబెట్టవచ్చు.బాగా ఆరిన వెన్నులను కర్రలతో కొట్టిగాని , ట్రాక్టరు నడపడం ద్వారా గాని గింజలను సేకరించాలి . అలా సేకరించిన గింజలను గాలికి తుర్పారాబెట్టి నాణ్యమైన గింజలను పొందవచ్చు.