రాగిని ఖరీఫ్ లో జూలై - ఆగస్టు మాసాల్లో, రబీలో నవంబర్ - డిసంబర్ మాసాలో , వేసవిలో జనవరి - ఫిబ్రవరి మాసాలో విత్తుకోవచ్చు.
1.2కిలోల విత్తనంతో 4 సేంట్లలో పెంచిన నారు ఎకరా పొలంలో నాటడానికి సరిపోతుంది . వెదజల్లే పద్ధతిలో ఎకరాకు 2-3 కిలోల విత్తనం కావాలి.
కిలో విత్తనాన్ని 2 గ్రా . కర్బండిజం లేదా 3 గ్రా . మంకోజేబ్ తో కలిపి విత్తన శుద్ధి చేయాలి .
స్వల్పకాలిక రకాలకు వరుసల మద్య 15 సెం.మీ., దీర్ఘకాలిక రకాలకు వరుసల మధ్య 15-20 సెం.మీ. వరుసలో 15 సెం.మీ. దూరం పాటించి విత్తుకోవాలి.
బాగా మెత్తగా తయారైన భూమిలో విత్తనాన్ని సమానంగా చల్లుకోవాలి.విత్తనం చల్లిన తరువాత బల్లతో గాని , చేట్టుకోమ్మతో గాని, నేలను చదును చేయాలి . లేనిచో విత్తనానికి తగినంత తేమ లభించక మొలక శాతం తగ్గుతుంది.
నారుపోసి నాటుకోవాలి . మురుగు నీటిపారుదల సౌకర్యంగల నెలల్లో నారు పోసుకోవాలి .
85 - 90 రోజుల స్వల్పకాలిక రకాలకు 21 రోజుల వయసుకల్గిన మొక్కలను , 105 - 125 రోజుల దీర్ఘకాలిక రకాలకు 30 రోజుల వయసు కల్గిన మొక్కలను నాటుకోవాలి . ఎకరాకు దీర్ఘకాలిక రకాలకు లక్ష ముఫై మూడు వేల మొక్కలు, స్వల్పకాలిక రకాలకు రెండు లక్షల అరవై ఆరు వేల మొక్కలు ఉంచాలి .