ఈ తెగులు నారుమడిలోను, తరువాత నాటిన పంటను ఆశిస్తుంది. వర్షపు జల్లులు పడుతూ గలిల్లో అధిక తేమ ఉండి, రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ చేరుకున్నపుడు అగ్గితెగులు ఉధృతి ఎక్కువ అవుతుంది . వాతావరణం ఎ విధంగా ఉంటె అధిక నత్రజని వాడిన పంటలలో తెగులు ఎక్కువ్వగా కనిపిస్తుంది.ఎదిగిన మొక్కల ఆకులు,కణుపులు,వెన్నులపైన దారపుకండే ఆకారంలో మచాలు ఏర్పడతాయి.ఈ మచ్చల చుట్టూ ఎరుపు గోధుమరంగు అంచులు కలిగి ఉంటాయి . కనుపులపై తెగులు ఆశిస్తే కణుపులు విరగడం , వెన్ను పై ఆశిస్తే గింజలు తాలు గింజలుగా మారుతాయి. దీని నివారణకు పంట పొలాల్లో కలుపు మొక్కలు లేకుండా చూడాలి. ఎందుకంటే కలుపు మొక్కల ద్వారా ఈ తెగులు పంటనాసిస్తుంది. ముందు జాగ్రత్త చర్యగా విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. తెగులును తట్టుకునే రత్నగిరి, పద్మావతి , గోదావరి రాకలను ఎన్నుకోవాలి.మొక్కలపై అక్కడక్కడ మచ్చలు కనిపించినపుడు లీటరు నీటికి 1 గ్రా. కర్బండిజిమ్ లేదా 3 మీ.లీ. కిటాజన్ మందు వాడకూడదు . నారునాటే ముందు బ్లైటాక్స్ లేదా మంకోజేబ్ మందును 3 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి ఆ ద్రావణంలో నారును ముంచి శుద్ధి చేసి నాటుకుంటే పంటను మొదటి దశల్లో ఆశించే తెగుల్లనుండి కాపాడుకోవచ్చు. వెదజల్లి విత్తేపద్దతిలో 3 గ్రా. తైరం లేదా కాప్టాన్ కిలో వితననికి కలిపి శుద్ధి చేయాలి.
లేత మొక్కల వేర్లు, మొదళ్ళపై తెగులు ఆశించి మొక్కలు కుళ్ళిపోతాయి. ఆకులపై చిన్న అండకారపు లేత గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తరువాత ఆకులు ఎండుతాయి . దీని నివారణకు తైరం లేదా కాప్టాన్ 3 గ్రా . కిలో విత్తనానికి కలిపి విత్తనాశుద్ది చేయాలి. మంకోజేబ్ 2.5 గ్రా . లీటరు నీటికి కలిపి పైరుకి పిచికారి చేయాలి .