నారుమడిలో 4 సెంట్ల నారుమడి ఎకరాకు సరిపోయే నారును ఇస్తుంది . 640 గ్రాముల నత్రజని ,640 గ్రాముల భాస్వరం మరియు 480 గ్రాముల పొతష్ నిచ్చే ఎరువులను వేయాల్సి వుంటుంది .
ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. ఎకరాకు 12 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 12 కిలోల పొతష్ నాటేటప్పుడు వేయాలి. నాటిన 30 రోజులకి మరో 12 కిలోల నత్రజనిని పైపాటుగా వేసుకోవాలి .