విత్తిన రెండు వారాల లోపుగా ఒత్తు మొక్కలను తిసివేయాలి. విత్తనం మరియు నారు నాటటానికి ముందు ఫ్లుక్లోరలిన్ 45% లేదా పెండిమిథాలిన్ 35 ఎకరాకు లీటరు చొప్పున 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును నివారించవచ్చు . నాటిన 25,30 రోజులకి వెడల్పాకు కలుపు మొక్కల నిర్మూలనకు ఎకరాకు 400 గ్రా. 2,4 డి సోడియం సాల్ట్ 80% పోడిమందు 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.