1.గులాబి రంగు పురుగు :

ఈ పురుగు సజ్జ,జొన్న,కొర్ర పంటలను కూడ ఆశిస్తుంది. ఈ పురుగు ముందు రెక్కలు ఎండుగడ్డి రంగులో వుంటాయి.వెనుక రెక్కలు తెల్లగా ఉంటాయి . బాగా ఎదిగిన లర్వాలు లేత గులాబి రంగులో ఉంటాయి .లార్వాలు కాండాన్ని తొలిచిసొరంగాలు చేసి లోపలి భాగాలను తినడం వలన మొక్క చనిపోతుంది . పంటను కంకి దశలో ఆశిస్తే అవి తెల్ల కంకులుగా మారుతాయి .ఈ లార్వా పురుగులు ఒక మొక్క నుండి యింకొక మొక్కకు పాకి నష్టపరుస్థాయి . దీని నివారణకు ఈ పురుగు ఆశించిన మొక్కలను గుర్తించి ఎరివేయాలి. మొక్కల అవశేషాలను కాల్చివేయడం. ద్వారా వీటివల్ల కలిగే నష్టం తగ్గుతుంది.అవసరాన్ని బట్టి ఒకటి,రెండు శాతం మొక్కల్లో పురుగు ఆసిన్చినపుడు లీటరు నీటికి ఎండోసల్ప్హన్ 2మీ.లీ.కలిపి పిచికారి చేయాలి.

2.శనగ పచ్చ పురుగు

ఇది రాగి పంటని కంకి దశలో ఆశించి పూత,గింజలను తిని నష్టపరుస్తుంది. నివారణకు పురుగు ఆసించినపుడు కంకులను దులిపి లేదా చేతితో ఎరివేసి నాశనం చేయాలి.లీటరు నీటికి 2 మీ.లీ. ఎండోసల్ప్హన్ లేదా 3 గ్రా కార్బరిల్ 50 శాతం పొడి మందు పిచికారి చేయాలి.

3.చెదలు

రాగి,కొర్ర పంటలను చెదలు ఎక్కువగా ఆశించి నష్టపరుస్థాయి . తేలిక నేలలో , వర్షాభావ పరిస్తితిలో ఈ పంటను పండించినప్పుడు చెదలు ఎక్కువగా నష్టం కలుగజేస్తాయి . వీటి నివారణకు పంటల చుట్టూ అక్కడక్కడ ఎత్తుగా కనిపించే పుట్టను నాశనం చేయాలి. ఆ పుట్టల పై భాగంలో రంధ్రం చేసి లీటరు నీటికి 5 మీ.లీ. చొప్పున క్లోరిపైరిఫాన్ మందును కలిపి ఒక్కొక్క పుట్టలో 10 - 12 లీటర్ల మందు ద్రావణం పోయడం ద్వారా చెదలను నివారించవచ్చు. ఈ చెదలు ఎక్కువగా నష్టపరిచే ప్రాంతాల్లో పంటలు వేసే ముందు ఆఖరి దుక్కిలో లిండెన్ పొడి మందును ఎకరాకు 10 కిలోల చొప్పున భూమిపై చల్లి కలియదున్నాలి.