ఆముదపు పంట విస్తీర్ణము,ఉత్పట్టులో భారత దేశము ప్రపంచంలోనే మొదటి స్థానము కలిగి యున్నది.ఆముదము ఉత్పత్తుల ఎగుమతి ద్వారా 650 కోట్ల రూపాయిలు సాలిన విదేశీమారక ద్రవ్యము నార్జి౦చుచున్నది.ఆముదము నూనెను నైలాన్ దారముల తయారి,జెట్ యంత్రాలలో ఇంధనంగా,హైడ్రాలిక్ ద్రవంగా,ఔషధాల తయారీ మొదలగు 200 పరిశ్రమలలో వాడుతున్నారు.పరిశ్రమలకూ,ఎగుమతులకూ ఆముదపు పంట చాలా ముఖ్యము కాబట్టి మరియు ధర కూడా ఎక్కువగానూ,నిలకడగాను ఉండటం వలన యీ పంటను ఎక్కువగాను పండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మేలైన వంగడాలను అధిక దిగుబడి నిచ్చు సంకర రకాలను వాడి,మంచి యాజమాన్య పద్ధతులు,సమగ్ర సస్య రక్షణను పాటించి అధిక దిగుబడిని సాధించవచ్చు.