ఆముదము పురుగులు
ఎర్ర గొంగళి పురుగు

ఈ పురుగు ఉధృతిని జూన్-జూలై మాసాలో అధికంగా ఉంటుంది.తొలకరి వర్షాలు పడి,భూమి10-20సెం.మీ లోతు తదిచినప్పుడు దీని రెక్కల పురుగులు భూమి నుండి వెలువడుతాయి.అదే రోజు మగ ఆడ పురుగులు కలిసి,అందుబాటులో ఉన్న మొక్కల యొక్క ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా (600-700)గ్రుడ్లను పెడుతాయి.తర్వాత 2-3రోజులలో గొంగళి పురుగులు వెలువడి ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి పత్ర హరితాన్ని గోకి తింటాయి.పురుగు పెరిగేకొల,ఆకులపై రంద్రాలేర్పరిచి ఆకుల కాడలను ఈనెలను,లేత కొమ్మలను మాత్రమే మిగుల్చుతాయి.ఎదిగిన గొంగళి పురుగులు ఒక పొలంలోకి గుంపులుగా వలాస పోయి పంటను ఆశించి నష్హ్తపరుచును.పెరిగిన లద్దె పురుగులు భూమిలోకి ప్రవేశించి మళ్ళి తొలకరి వర్షాల వరకు కోశస్థ దశలోనే ఉంటాయి.

నివారణ
  • వేసవిలో భూమిని లోతుగా(15-30సెం.మీ) దున్నుకోవాలి.
  • తొలకరి వర్షాలు కురిసిన తరువాత 2-3రోజులు రాత్రి 7-10గం మధ్య సమయంలో పొలంలో అక్కడక్కడ సామూహికంగా మంటలు పెట్టినట్లైతే వాటికి రెక్కల పురుగు ఆకర్షి౦పబడి చనిపోతాయి.
  • దీపపు ఎరలను పెట్టాలి.
  • పైరు విత్తటానికి వారం రోజుల ముందు,పొలం గట్లపైన దోస నాటినట్లితే ,గొంగళి పురుగులు ఆకర్శించబడుతాయి.వాటిని ఏరి నాశనం చేయాలి.
  • గ్రుడ్లను ఏరి నాశనం చేయాలి.
  • ఎదిగిన గొంగళి పురుగులను జిల్లెడు,లొట్టపీచు మరియు అడవి ఆముదము ఆకులకు బాగా ఆకర్శించబడుతాయి.కాబట్టి ఈ ఆకులను పొలంలో ఎరగా పెట్టి పురుగులను ఏరి చంపాలి.
  • పురుగు తీవ్రత బట్టి మీ సమీప వ్యవసాయ అధికారిని సంప్రదించండి.

దాసరి పురుగు

లద్దె పురుగులు తొలి దశలో ఆకులను గోకి,తర్వాత దశలో రంద్రాలేర్పరిచి ఆకులను తింటాయి.పురుగు ఉధృతిని ఎక్కువగా ఉన్నప్పుడు లేత కొమ్మలను,కాడలను,పువ్వులను మరియు పెరిగే కాయలను తిని తీవ్ర నష్టాన్ని కలుగ జేస్తుంది.

నివారణ
  • కార్బరిల్ 3గ్రా.లేదా మోనోక్రోటోఫాస్ 1.5మి.లీ మందును ఒక లీటరు నీటికి కలిపి ఆకు అడుగు భాగం తడిసేలా పిచికారి చేసుకోవాలి.
  • ఎకరానికి 10పంగ కర్రలను పక్షులు వాలుతకు వీలుగా నాతుకోన్నట్లితే పోలంలోక్ పక్షులు వచ్చి పురుగులను ఏరి తింటాయి.
  • పొలంలో క్రింద పడినటువంటి ఎండు ఆకులను తీసి కాల్చివేయాలి.

పొగాకు లద్దె పురుగు

తొలి దశలో గుంపులుగా ఆకుల క్రింద భాగాన్ని పత్ర హరితాన్ని గోకి తింటాయి,ఆకులు పలుచాటి కాగితాలవలె కనిపిస్తాయి.పురుగులు పెరిగే కొలది ఆకులపై రంద్రాలేర్పరిచి జల్లెడాకులుగా మారుస్తాయి.లద్దె పురుగులు పగటి వేళల్లో మట్టిపెడల క్రింద లేదా పగుళ్ళలో దాగుకుని రాత్రి వేళ్ళల్లో పైరును ఆశించి నష్టాన్ని కలుగచేస్తాయి.

నివారణ
  • వేసవి దుక్కులు లోతుగా దున్నుకోవాలి.
  • గ్రుడ్లు మరియు పిల్ల లద్దె పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా ఉంటాయి కాబట్టి వాటిని ఆకులతో సహా ఏరి నాశనము చేయాలి.
  • ఎకరాకు 4-5 లి౦గాకర్షక ఎరలను అమర్చి పురుగుల ఉధృతిని గమనిస్తూ అవసరమైనప్పుడు నివారణ చర్యను చేపట్టాలి.
  • తొలి దశలో వేపనూనె 5మి.లీ లేదా క్లొర్ పైరిఫాన్ 2.5మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 2మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • పొలం చుట్టు లోతైన నాగటి సాలును తీసి అందులో మిథైల్ పెరాథియాన్ 2 లేదా ఎండోసల్ఫాన్ 4పొడి మందును చల్లి పురుగులను నివారించవచ్చును.

కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు

తొలి దశలోని పురుగు కొమ్మలపై మరియు కాయలపైన ఉన్నటు వంటి పత్రహరితాన్ని గోకి తింటుంది.పుష్పించే దశలో కొమ్మలోకి పోయి నష్టపరుస్తుంది.తర్వాత దశలో పురుగు కాయలలోకి పోయి తింటుంది.

నివారణ

పుష్పించే దశలో ఒకసారి మరియు 20రోజులకు మరొకసారి డైమిదోయేట్ 2.0మి.లీ లేదా మెటాసిస్టాక్స్ 2.0మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 2మి.లీ మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.


బిహారి గొంగళి పురుగు

ఈ పురుగు గ్రుడ్ల నుండి బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులలో నే పొలంలోని ఆకులన్ని తిని తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది.మొక్కలపై ఆకులు లేనప్పుడు ,గెల తిని నష్టపరుస్తుంది.

నివారణ

వేప నూనె 5మి.లీ లేదా క్లోర్ పరిఫాస్ 2.0మి.లీ లేదా దైక్లోరోవాస్ 1మి.లీ మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.


పచ్చ దీపపు పురుగులు

ఈ పురుగు ఆకుల నుండి రసం పీల్చి తీవ్ర నష్టాన్ని కలుగ జేస్తాయి.ఆకులు పసుపు రంగులోకి మారి మాడిపోతాయి.

నివారణ
  • వేప నూనె 5మి.లీ లీటరు నీటికి కలిపి ఆకుల అడుగు భాగాలు బాగా తడిచేల పిచికారి చేయాలి.
  • ఉధృతిని ఎక్కువగా ఉన్నప్పుడు మోనోక్రోటోఫాస్ 2మి.లీ లేదా డైమిధోయేట్ 2మి.లీ మందును ఒక లీటరు నీటిలో కలిపి ఆకుల అడుగు భాగం తదిచేల పిచికారి చేయాలి.

ఆకు తొలిచే పురుగు

తొలి దశలలో పిల్ల పురుగులు ఆకు పోరలలోనికి పోయి సోరంగాలుగా తొలచి ఆకులను తింటుంది.దీనినే పాము పొడ తెగులు అ౦టారు.ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు పూర్తిగా రాలిపోతాయి.

నివారణ

వేప నూనె 5మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.