ఆముదము తెగుళ్ళు
మొలక కుళ్ళు తెగులు లేకా ఫైటాప్తోరా బ్లైట్

విత్తనము మొలకెత్తిన తర్వాత బీజ దళాలపై గుండ్రని ఆకుపచ్చ రంగుమచ్చాలు తెగులు సోకిన ఆకులు వాడి కుళ్లిపోయి మొక్కకు వ్రేలాడును.ముదురు ఆకులపైన పెద్ద పెద్ద మచ్చలు ఆకు చివరి నుండి తొడిమ వైపుకు వ్యాపించును.ఈ తెగులు కా౦డానికి కూడా వ్యాపించి మొక్కలు చనిపోవును.

నివారణ
  • నీరు నిలువ ఉండే భూములలో ఆముదము పండించ రాదు.
  • వివరాలకు మీ సమీప వ్యవసాయ అధికారిని సంప్రదించండి.

ఆల్టర్నేరియా ఆకు మచ్చ తెగులు

పంట విత్తిన తర్వాత తెగులు మొదటి లక్షణాలు బీజ దళాలపై కనపడతాయి.ఆకులపై వలయాకారపు మచ్చలు ఏర్పడి మొక్కల పెరుగుదల తగ్గును. అనుకూలపు వాతావరణ పరిస్థితుల్లో ఈ తెగులు పూవు,గెల మరియు కాయలకు కూడా వ్యాపిస్తుంది.

నివారణ
  • ముందరి పంట అవశేషాలను ఎరి నాశనం చేయాలి.
  • వివరాలకు మీ సమీప వ్యవసాయ అధికారిని సంప్రదించండి.

సర్కోస్పొరా ఆకు మచ్చ తెగులు

ఆకుల రెండు వైపుల చిన్న చిన్న నల్లని లేక గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ,పెద్దవై లేత గోధుమ రంగులోకి మారును.మచ్చ అంచులు ముదురు గోధుమ రంగుతో ఉండి మధ్య భాగాన బూడిద రంగుతో ఉండును.

నివారణ
  • వివరాలకు మీ సమీప వ్యవసాయ అధికారిని సంప్రదించండి

వడలు తెగులు

తెగులు సోకిన మొక్కలు లేత దశలో వున్నట్లైతే మొక్కలు వడలిపోయి బీజదళ పత్రాలు రంగును కోల్పోయి పాలిపోయి తర్వాత మొక్క చనిపోతుంది.కాండము మీద ఊదారంగు మచ్చలు ఏర్పడి తర్వాత కా౦డముపై పొరపై చీలికలు ఏర్పడతాయి.కాండమును చీల్చిచూచినట్లైతే లోపల తెల్లని బూజులాంటి శిలి౦ద్రపు పెరుగుదలను గమని౦చవచ్చును.

నివారణ
  • నీరు నిలిచే నేలలు మరియు పల్లపు ప్రాంతాలలో ఆముదు సాగు చేయరాదు.
  • వేసవిలో పొలాన్ని లోతుగా దున్నుకోవాలి.
  • పంట మార్పిడి చేయాలి.
  • తెగులును తట్టుకునే రకాలైన జ్యోతి,జి.సి.హెచ్.4,48-1వంటి రకాలను విత్తుకోవాలి.
  • పొలంలో వీలైనంత ఎక్కువ పశువుల ఎరువును వేయాలి.
  • పొలంలో వర్షపు నీరు నిలువకుండా జాగ్రత్త వహించాలి.
  • తెగులు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు పొలం నుండి తొలగించాలి.
  • అంతర పంటగా కంది వేయాలి
  • మిగతా వివరాలకు మీ సమీప వ్యవసాయ అధికారిని సంప్రదించగలరు.

వేరు కుళ్ళు మరియు కాండము,కొమ్మ ఎండు తెగులు

ఈ దశలో తెగులు సోకిన మొక్కలు ముదురు పసుపు పచ్చ రంగుకు మారి మొక్క పెరుగుదల ఆగిపోవును.మొక్క చివరి నుండి 1లేక 2ఆకులు మినహా మిగతా ఆకులన్ని ఎండిపొయి మొక్కనుండి క్రిందకు వ్రేలాడును.ఈ దశలో మొక్కల మొదళ్ళ వద్ద నల్లగా మారును.అకస్మాతుగా మొక్కలు ఎండిపోవడం ఈ దశ యొక్క ముఖ్యా లక్షణం.

కాండము,కొమ్మ ఎండు దశ

కాండం కణువుల దగ్గర గోధుమ రంగు చారలు ఏర్పడి,పెద్దవై అ౦డాకారంగా మారుచు తెగులు సోకిన కా౦డపు భాగం కృశించు విరిగి పోవును.కొమ్మ యొక్క చివర పెరిగే భాగము నల్లగా మారును.తెగులు సోకిన కొమ్మ పై నుండి క్రిందకి ఎండుకంటు వచ్చును.

నివారణ
  • నీరు నిలిచే నేలలు మరియు పల్లపు ప్రాంతాలలో ఆముదు సాగు చేయరాదు.
  • వేసవిలో పొలాన్ని లోతుగా దున్నుకోవాలి.
  • పంట మార్పిడి చేయాలి.
  • తెగులను తట్టుకునే రకాలైన జ్యోతి,జి.సి.హెచ్.4,48-1 వంటి రకాలను విత్తుకోవాలి.
  • పొలంలో వీలైనంత ఎక్కువ పశువుల ఎరువును వేయాలి.
  • పొలంలో వర్షపు నీరు నిలువకుండా జాగ్రత్త వహించాలి.
  • తెగులు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు పొలం నుండి తొలగించాలి.
  • అంతర పంటగా కంది వేయాలి
  • మిగతా వివరాలకు మీ సమీప వ్యవసాయ అధికారిని సంప్రదించగలరు.

కాయకుళ్ళు బూజు తెగులు

ఈ తెగులు ముఖ్యంగా గెలపైన లేదా కొన్ని కాయలపైన గోధుమ రంగు ,మచ్చలు ఏర్పడి ,తర్వాత ఈ వ్యాధి అన్ని కాయలకు వ్యాపిస్తుంది.తెగులు సోకిన భాగాల పైన దూది పింజలాంటి బూడిద లేక గోధుమ వర్ణపు శిలీంద్రపు పెరుగుదల కనిపిస్తుంది.తెగులు సోకిన కాయలు మెత్తబడి,కుళ్ళి రాలిపోతాయి.గెల కాడ పై,శాఖలపై కూడా ఈ తెగులు ఆశించడం వలన వ్యాధి సోకిన భాగాలు విరిగి పడిపోతాయి.

నివారణ
  • పొలంతో మొక్కలను మరీ దగ్గరగా నాటరాదు.
  • సకాలంలో పంటను విత్తుకోవాలి.
  • తెగులు సోకిన కాయలను,గెలలనుకోసి పొలానికి దూరంగా వేసి తగల బెట్టి దీని వ్యాప్తిని అరికాట్టాలి.
  • మరిన్ని వివరాలకు మీ సమీప వ్యవసాయ అధికారిని సంప్రదించండి.