ఎరువులు

ఎరువుల యాజమాన్యం

ప్రతి సంవత్సరం విధిగా హెక్టారుకు 5-10టన్నుల పశువుల ఎరువును దుక్కిలో వేసి కలియ దున్నాలి.ఇలా చేయడం వలన తెగులు కొంతవరకు నివారించుకొనవచ్చును.ఎరువులను భూసార పరిక్షా ఫలితాలననుసరించి నిర్ణయించిన మోతాదులో వాడాలి.

హెక్టారుకు నత్రజని 90కిలోలు,భాస్వరము 50కిలోలు ,పోటాష్ 30కిలోలు వేసుకోవాలి.నత్రజని మాత్రము 30కిలోలు మొదటి దఫా ఇతర ఎరువులతో కలిపి దుక్కిలో వేసుకోవాలి.మిగిలిన 60కిలోల్లో ఒక పర్యాయం 30కిలోలు మొదటి గెల పూత దశలో అనగా 40 నుండి 50 రోజులలో,మిగిలిన 30కిలోలు రెండవ గెల పూత దశలో అనగా 70 నుండి 80 రోజులలో వేసుకొని నీరు కట్టుకోవాలి.