విత్తిన 40,60రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూడాలి.విత్తిన15,20రోజులకు కుదురుకు ఒక మొక్క ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి.విత్తే ముందు ఫ్లుక్లోరలిన్ 45ఎకరాకు లీటరు చొప్పున పిచికారి చేసి భూమి లో కలియ దున్నాలి లేదా పెండిమిథాలిన్ 30,1.3నుండి 1.6లీ లేదా తేలిక నెలల్లో 800మి.లీ ,బరువు నెలల్లో 1లీటరు చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి.కలుపు మందులు వాడితే 40రోజులప్పుడు ఒక సారి,వాడనప్పుడు 20రోజులకు 40రోజులకు గుంటక లేదా గోర్రుతో అంతరకృషి చేసి కలుపు నివారించవచ్చు.