మన రాష్టంలో రబీ కాలం లో పండించే ఆపరాలలో శనగ ముఖ్యమైనది .శీతా కాలంలో కేవలం మంచు తో పెరిగె శనగ పంట మన రాష్టంలో పలు ప్రాంతాలలో అధిక దిగుబడి నివ్వడం వల్ల ఈ పంట విస్తీర్ణం బాగా పెరిగింది.
ఈ పంటను ఎక్కువగా గుంటూరు ,ప్రకాశం మరియు కర్నూలు జిల్లాలలో పండిస్తున్నారు .ఈ పంట నల్ల రేగడి భూముల్లో సాగుచేయబడుతుంది . రాష్టంలో శనగ విస్తీర్ణం సుమారుగా 8.0 లక్షల ఎకరాలు .ఉత్పత్తి 3.55 లక్షల టన్నులు .దిగుబడి ఎకరాకు 440 కిలోలు .శనగ గింజల ఉత్పత్తి విలువ 643 కోట్ల రూపాయలు.