ఇది లద్దే పురుగు దశలో పూతను ,కాయలను తింటూ ఉంటుంది .సీతాకోక చిలక దశలో పూత పైన ,కాయలపైన గ్రుడ్లును ఒక్కోకటిగా పెడుతుంది .గ్రుడ్ల నుండి వచ్చిన పురుగు కాయలను తొలిచి గింజలను తింటుంది .నివారణకు లీటరు నీటికి ఎండోసల్ఫాన్ 2.౦ మి.లీ. లేక క్వినాల్ ఫాస్ 2.0 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.0గ్రా .చొప్పున పూత ,పిందె దశల్లో 10 రోజుల వ్యవధిలో మందులను మర్చి రెండు ,మూడు సార్లు పిచికారి చేయాలి .శనగతో అంతరపంటలుగా ఆవాలు (యల్ బి యమ్ 428,క్రాంతి ,సిత ),ధనియాలు (సింధు ,సాధన ,స్వాతి )వేసుకోవాలి .