మన రాష్ట్రంలో పెసర సాగు విస్తేర్ణం 13.0 లక్షల ఎకరాలు, ఉత్పత్తి 1.86 లక్షల టన్నులు మరియు ఉత్పాదకత ఎకరాకు 140 కిలోలు . ముఖ్యంగా తెలంగాణా,రాయలసీమ ప్రాంతాల్లో తొలకరి పంటగాను కోస్తా ఆంధ్రలో తొలకరి మరియు రబీ పంటగా పండిస్తారు . రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో,వేసవిలో కృష్ణ , గోదావరి డెల్టా ప్రాంతాలలో మూడవ పంటగాను పండిస్తున్నారు.నీరు ఆలస్యంగా వచ్చి వారి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాలలో పండించవచ్చు . ప్రత్తిలో అంతర పంటగా కూడా పండించవచ్చు.