ఈ పురుగులు పైరుపై రెండు ఆకుల దశలో ఆశించి రంద్రాలు చేస్తాయి . వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నివారించాకపోతే 80 శాతం మొక్కలు ఈదశలోనే చనిపోతాయి. నివారణకు 2.5 మి.లీ. క్లోరిపైరిఫాన్ లేదా 2.0 మి.లీ ఎండోసల్ఫాన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి .
ఈ పురుగులు తొలి దశలో లేత ఆకులపై వృద్ధి చెంది రసాన్ని పిలుస్తాయి . వీటి వల్ల ఆకు ముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపిస్తుంది.పంటకు 15-20 శాతం నష్టం కలుగుతుంది . నివారణకు మొనోక్రోటోఫాన్ 1.5 మీ.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రా .లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి .
ఈ పురుగులు ఆకుల్లోని రసాన్ని పిలుస్తాయి . అంతేగాక ఎల్లోమొజాయిక్ అనే వైరస్ వ్యాధిని( పుల్లాకు తెగులు) కూడా వ్యాపింపచేస్తాయి. వీటి నివారణకు 1.6 మి.లి. మొనోక్రోటోఫాన్ లేదా 2 మి.లి. మిథైల్ డేమేటాన్ ను లేదా డ్రైజోఫన్ 2.0 మి.లి . లీటరు నీటికి కలిపి పిచికరి చేయాలి.
ఈ పురుగు మొగ్గ, పూత , పిందె దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలుగచేస్తుంది. పూత దస పూతను గుడుగా చేసి లోపల పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేపుడు కాయలను దగరకు చేర్చినగుడుగా కట్టి కాయలకు రంద్రం చేసి లోపల గింజలను తినటం వలన పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది. నివారణకు క్లోరిపైరిఫాస్ 2.0 మీ.లీ. లేదా క్వినాల్ ఫాస్ 2.0 మీ.లీ. మరియు డైక్లోర్ వాస్ 1.0 మీ.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి .
ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గీరి తినటం వలన ఆకులు తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి,ఆకులను పూర్తిగాను,పువ్వులను, పిందెలను కూడా తింటాయి . ఈ పురుగులు రాత్రి పుట ఎక్కువగా తింటూ , పగలు మొక్కల మొదలలోను భూమి నేర్రేలలోను చేరతాయి . నివారణకు ఈ క్రింద సూచించిన సమగ్ర సస్య రక్షణ చర్యలను పాటించాలి.