బూడిద తెగులు :

ఈ తెగులు విత్తన 30-35 రోజులు తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు.ముదురు ఆకులపై , బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలుగా కనపడి, అవి క్రమేణా పెద్దవై ఆకుల పైన , క్రింద భాగాలకు మరియు కొమ్మలు , కాయలకు వ్యాపిస్తుంది . నివారణకు లీటరు నీటికి 1 గ్రాము కర్బండిజం లేదా 1 గ్రాము తయోఫానేట్ మిథైల్ లేదా 1 మి.లి. కేరాథెన్ లేదా 1 మి.లి హెక్సాకొనజొల్ లేదా 1.మి.లి ట్రైడిమర్ఫ్ లను కలిపి 10-15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి . నిర్దేశించిన కాలంలో విత్తుకోవాలి . మొక్కల సాంద్రత సరిపడా వుండాలి . తెగులను తట్టుకునే రకాలను విత్తుకోవాలి.


సేర్కొస్పోర ఆకుపచ్చ తెగులు :

ఈ తెగులు సోకిన ఆకులపై గోధుమ రంగు గుండ్రని చిన్న చిన్న మచ్చలు కనిపించి అనుకూల వాతావరణ పరిస్తితులలో . ఈ మచ్చలు పెద్దవై ఆకులు ఎండి రాలిపోతాయి . దీని వలన కాయల్లో గింజలు సరిగా నిండవు . దీని నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మంకోజేబ్ లేదా 2 గ్రా . క్లోరోథాలోనిల్ లేదా 1 గ్రాము కార్బండజిమ్ లేదా 1 గ్రాము థాయోఫనేట్ మిథైల్ లను కలిపి వాడటం ద్వారా ఆకుపచ్చ తెగులుతో పాటు బూడిద తెగులును నివారించవచ్చు.


కోరినోస్పోర ఆకుపచ్చ తెగులు :

ఈ తెగులు ఆసించినపుడు పెసర ఆకులపై చిన్న చిన్న గుండ్రని గోధుమరంగు మచ్చలు ఏర్పడి అనుకూల వాతావరణ పరిస్థితులలో అంటే గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు పెద్ద మచ్చల చుట్టూ వలయాకారంగా ఏర్పడి ఆకులు ఎండి రాలిపోతాయి . ఈ తెగులు 30-35 రోజుల పంటను ఆశిస్తుంది . దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ 3 గ్రా లేదా మంకోజబ్ 2.5 గ్రా లీటరు నీటికి 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.


బాక్టిరియల్ బ్లైట్ :

ఈ తెగులు సోకినా మొక్కల ఆకులపై గోధుమ వర్ణంలో చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి. 1 గ్రా. పౌషామైసిన్ ను నీటిలో కలిపిన ద్రావణంలో కిలో విత్తనాన్ని 30 నిముషాలు నానబెట్టి విత్తాలి . ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రా . కాపర్ ఆక్సిక్లోరైడ్ మరియు 100 మి.గ్రా. ప్లాంటో మైసిన్ ను కలిపి 12 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి .


ఆకుముడత తెగులు (మోవ్వకుళ్ళు) :

ఇది వైరస్ జాతి తెగులు . తామర పురుగులు ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాపిస్తుంది. తెగులు ఆశించిన మొక్కలు ఆకులు అంచులు వెనుకకు ముడుచుకొని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకుల అడుగుభాగంలోని ఈ నెలు రక్తవర్నాన్ని పోలి వుంటాయి . లేత దశలో వ్యాధి సోకినా మొక్కలను పికి తగులబెట్టడం ద్వారా పైరులోని ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు .నివారణకు లీటరు నీటికి 1 గ్రాము ఎసిఫేట్ లేక 2 మీ.లీ డైమితోయేట్ మందును కలిపి పిచికారి చేయాలి. యం.జి.జి.-295 యల్.జి.జి.- 460 , పెసర రకాలు , టి- 9 , యల్.జి.జి. - 20 మినుము రకాలు ఈ తెగులును కొంతవరకు తట్టుకొంటాయి.


ఎల్లోమోజయిక్ (పల్లాకు ) తెగులు :

ఇది వైరస్ జాతి తెగులు . ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది.ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు , కాయలు మిద పసుపు పచ్చ పొడలు ఏర్పడతాయి . తెల్లదోమ నివారణకు లీటరు నీటికి 1.6 మి.లి. మొనోక్రోటోఫాస్ లేక 2 మి.లి డైమితోఎట్ మందును పిచికారి చేసి కొంతవరకు నివారించవచ్చు . ఎమ్.ఎల్.267 , ఎల్.జి.జి. 407 ,డబ్ల్యు.జి.జి. 37 రకాలు ఈ తెగులును తట్టుకోగలవు. తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి కాల్చి వేయాలి.తెల్లదోమ ఉధృతిని వెంటనే అరికట్టాలి.