ఖరీఫ్ కాలంలో ఉత్తర తెలంగాణా , దక్షణ తెలంగాణా మరియు తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ నెలలోను , కృష్ణ - గోదావరి , దక్షణ మండలం మరియు ఉత్తరకోస్తా మండలాల్లో జూన్ - జులై లోను విట్టుకోవచ్చు . రబీలో ఉత్తర , దక్షణ తెలంగాణా , కృష్ణ - గోదావరి దక్షణ మండలం మరియు ఉత్తర కోస్తా మండలాల్లో అక్టోబర్లో విత్తుకోవచ్చు . కృష్ణ - గోదావరి మండలంలో వరి మాగాణాల్లో నవంబర్ - డిసంబర్ మొదటి వారంలో , వేసవికాలంలో ఫిబ్రవరి - మర్చి లో విత్తుకోవచ్చు .
కిలో విత్తనానికి 30 గ్రాముల కర్భోసల్ఫేట్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి . ఈ పైరుకు కోత్తగా పండించేటప్పుడు , రైజోబియం కల్చరు ను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చు .
సాళ్ళ గోర్రుతో వేదబెట్టాలి . మాగాణాల్లో వరి కోయడానికి 2-3 రోజుల ముందు భూమి తేమ పరిస్థితి బట్టి తడి లేక పొడి విత్తనాలు వేదజల్లాలి .
వరుసల మద్య 30 సెం.మీ. మొక్కల మద్య 10 సెం.మీ.దూరం లో విత్తుకోవాలి .