భారతదేశం ప్రపంచంలోని ప్రత్తి ఉత్పత్తి మరియు నూలు ఎగుమతుల్లో ప్రధాన పాత్ర వహిస్తుంది. మన రాష్ట్రం భారతదేశంలోనున్న సాగు విస్తీర్ణంలో 12.6 శాతం కలిగి మొత్తం ప్రత్తి ఉత్పత్తి లో 14 శాతం మేర ఆక్రమించింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రత్తి 27.88 లక్షల ఎకరాల్లో సాగుచేయబడి, 32.50 లక్షల బేళ్ళ ఉత్పత్తినిస్తుంది. సరాసరి దిగుబడి ఎకరాకు 195 కిలోలు.