ప్రత్తి పంటకు హెక్టారుకు కనీసం 10 టన్నుల పశువుల ఎరువు తోలుట అవసరం.సేంద్రియ ఎరువులతోపాటు జీవన ఎరువులను విత్తనములకు పట్టించి రసాయనపు ఎరువులను తగు మోతాదులో వాడుకోవాలి.
అజటోబాక్టర్ ,అజొస్పైరిల్లా వంటి సూక్ష్మజీవులు మొక్క వేళ్ళ ద్వారా విసర్జించే పదార్దాలను గాలిలోని నత్రజనిని ఉపయోగించుకుని పెరుగుతూ,మొక్కలను ఉపయోగపడే హార్మోన్లు తదితర నత్రజని పదార్ధాలను విసర్జిస్తాయి.పంటలు ఏపుగా ఆరోగ్యవంతంగా పెరగడానికి ఈ పదార్ధాలు ఉపయోగపడతాయి.ఈ ఎరువులు ఉపయోగపడాలంటే సేంద్రియ ఎరువులు బాగా వేయాలి.
ఎరువులు(ఎకరాకు కిలోల్లో) | ||||
---|---|---|---|---|
ప్రాంతం | నత్రజని | భాస్వరం | పొటాష్ | |
కోస్తా ప్రాంతం | ||||
అమెరికన్ రకాలు | 36 | 18 | 18 | |
సంకర జాతి రకాలు | 48 | 24 | 24 | |
రాయలసీమ | ||||
దేశవాళీ రకాలు | 8 | 8 | - | |
అమెరికన్ రకాలు(వర్షాధారం) | 16 | 8 | 8 | |
రాయలసీమ అమెరికన్ రకాలు(నీటి వసతి) సంకరజాతి రకాలు | 36 48 | 18 24 | 18 24 | |
తెలంగాణ | ||||
దేశవాళీ రకాలు | 16 | 8 | 8 | |
అమెరికన్ రకాలు | 36 | 18 | 18 | |
సంకరజాతి రకాలు | 48 | 24 | 24 | |
వరి కోసిన తర్వాత వేసే మాగాణి భూముల్లో | ||||
సూటి రకాలు | 54 | 18 | 18 | |
హైబ్రిడ్స్(సంకరజాతి రకాలు) | 60 | 24 | 24 |
ఈ ధాతు లోపమున్నప్పుడు ముదురు ఆకులు,అంచుల నుండి మధ్య భాగం పసుపు రంగుకు మారతాయి.ఆకుల ఈనెల మాత్రం ఆకుపచ్చగా వుంటాయి.ఆకులు ఎర్రబారి ఎండిపోయి రాలిపోతాయి.ఈ లోపం పొటాషియం ఎక్కువగా ఉన్న నేల్లో సామాన్యంగా కనిపిస్తుంది.మెగ్నీషియం లోపనివారణకు లీటరు నీటికి 10గ్రా.మెగ్నీషియం సల్ఫేట్,పైరు వేసిన 45 మరియు 75రోజుల తరువాత రెండు సార్లు పిచికారి చేయాలి.
ఈ ధాతువు లోపం,మొక్క మధ్య ఆకుల మీద కనిపిస్తుంది.ఆకుల ఈనెలు ఆకుపచ్చగా వుండి ఈ నెల మధ్య భాగం మాత్రమే పసుపుపచ్చగా మారుతు౦ది.కొమ్మ చివరి ఆకులు చిన్నవిగా వుండి,ముడతలు పడి,కణుపుల మధ్య దూరం తగ్గుతుంది.సేంద్రియ పదార్థం తక్కువైనా,సున్నం పాలు మరియు భాస్వరం ఎక్కువగా ఉన్న నేలల్లో ఈ లోపం కనిపిస్తుంది. జింకు లోప నివారణకు ఆఖరి దుక్కిలో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేటు వెయ్యాలి లేదా పైరు మీద జింకు లోప లక్షణాలు గుర్తించిన వెంటనే లీటరు నీటికి 2గ్రా.జింకు సల్ఫేటు 5-6 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.
బోరాన్ లోపం వల్ల క్రొత్తగా పెరిగే చివర మొగ్గలు ముఖ్యముగా దెబ్బతింటాయి.కొమ్మల చివరి మొగ్గల పెరుగుదల ఆగిపోయి ప్రక్క మొగ్గల పెరుగుదలను ప్రోత్సహించబడట౦తో ప్రక్కల నుండి అనేక కొమ్మలు బయలు దేరి మొక్క చివర గుబురుగా కనిపిస్తుంది.ఆకులు,కాడలు మరియు చివరి మొగ్గలు రంగు రూపాలు మారిపోయి,అన్ని భాగాలు ముతకగా,దళసరిగా,పెళసుగా,ద్రవంతో అచ్చటచ్చట తేమ తేమగా ఉండి,క్రుళ్ళుతున్నట్లు కనిపిస్తే అది బోరాన్ లోపమని గుర్తించవచ్చు. బోరాన్ లోప నివారణకు పైరు వేసిన 60మరియు 90 రోజుల తరువాత లీటరు నీటికి 1-1.5గ్రా.బోరాక్స్ వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చెయ్యాలి. అన్ని ప్రాంతాలకు సిఫారసు చేసిన భాస్వరం ఎరువులు ఒకేసారి ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి.కొస్తా,రాయలసీమ మరియు తెలంగాణా ప్రాంతాలలో అమెరికన్ రకాలకు మరియు హైబ్రిడ్స్ కు సిఫారసు చేసిన నత్రజని మరియు పోటాష్ లన సమభాగాలుగా చేసి విత్తిన ౩౦,60,90, రోజులకు మొక్క మొదళ్ళకు 7-10 సెం.మీ దూరంలో పాదులు తీసి వేయాలి.రాయలసీమ లోని వర్షాధార అమెరికన్ రకాలకు సిఫారసు చేసిన నత్రజని ని రెండు సమభాగాలుగా చేసి విత్తిన 30,60 రోజులకు పైన తెలిపిన విధంగా వేయాలి.