ఇతర విషయాలు
పత్తి తీయటంలో జాగ్రత్తలు
ఎండిన ఆకులు,ఇతర చెత్త కలపకుండా తీయాలి.కాయతొల్చు పురుగులు ఆశించిన ప్రత్తిని వేరు చేయాలి.తీసిన ప్రత్తిని నీడలో ఆరబెట్టి నిల్వచేయాలి.నిల్వ చేసిన ప్రత్తికి గాలి తగిలేటట్లు తేమ తగలకుండా చూడాలి.ప్రళ,పింజ మృదుత్వం మరియు పింజ పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది.ప్రత్తి నాణ్యత అనేది జన్యుసంభందమైనది.అయితే దీని మీద వాతవరణం మరియు చీడపీడల ప్రభావం కూడా కొంతమేరకు వుంటుంది.
శీతోష్ణ స్థితి
రాత్రి వేళల౦దు చల్లటి గాలి ఉన్నప్పుడు అధిక దిగుబడి సాధించడానికి వీలవు తుంది.మంచి పంట పండించడానికి వర్షాధారం క్రింద కనీసం 500మి.మీ వర్షం ఉండటమేకాకుండా అవి సకాలంలో పడాలి.
ప్రత్తి తీతలో మెళుకువలు
ప్రత్తి లో పూత దఫదఫాలుగా రావటంవల్ల ప్రత్తిని కనీసం నాలుగైదు సార్లు తీయవలసి వస్తుంది.బాగా ఎండినటువంటి ప్రత్తిని మాత్రమే గుల్లల నుండి వేరు చేయాలి.ప్రత్తిని ఉదయం ఎనిమిది గంటల తరువాత మధ్యాహ్నం ఒంటిగంటలోపల,మరల సాయంత్రం మూడు గంటల నుంచి ఆరుగంటల లోపల తీయాలి.వేడి ఎక్కువగా వున్న సమయంలో ప్రత్తిని తీస్తే వాటితో పాటు గుల్లల వద్ద వున్న తొడిమలు,ఎండిన ఆకులు పెళుసెక్కి ముక్కలై ప్రత్తికి అంటుకుంటాయి.ప్రత్తిని తీయగానే నీడలో మండెలు వేయాలి.
అలా చేయనట్లైతే దానిలో వున్న తేమ వలన వేడి ఎక్కువై గింజలు ముడుచుకుపోయి ప్రత్తి తూకం తగ్గటమే కాకుండా,ముక్కు పురుగు తగిలి నాణ్యత తగ్గుతుంది.
ప్రత్తి తీతలో మెళుకువలు
ప్రత్తి లో పూత దఫదఫాలుగా రావటంవల్ల ప్రత్తిని కనీసం నాలుగైదు సార్లు తీయవలసి వస్తుంది.బాగా ఎండినటువంటి ప్రత్తిని మాత్రమే గుల్లల నుండి వేరు చేయాలి.ప్రత్తిని ఉదయం ఎనిమిది గంటల తరువాత మధ్యాహ్నం ఒంటిగంటలోపల,మరల సాయంత్రం మూడు గంటల నుంచి ఆరుగంటల లోపల తీయాలి.వేడి ఎక్కువగా వున్న సమయంలో ప్రత్తిని తీస్తే వాటితో పాటు గుల్లల వద్ద వున్న తొడిమలు,ఎండిన ఆకులు పెళుసెక్కి ముక్కలై ప్రత్తికి అంటుకుంటాయి.ప్రత్తిని తీయగానే నీడలో మండెలు వేయాలి.
అలా చేయనట్లైతే దానిలో వున్న తేమ వలన వేడి ఎక్కువై గింజలు ముడుచుకుపోయి ప్రత్తి తూకం తగ్గటమే కాకుండా,ముక్కు పురుగు తగిలి నాణ్యత తగ్గుతుంది.
బిటి ప్రత్తి
1.బిటి ప్రత్తి సాగులో పాటించవలసిన పద్దతులు
- బిటి ప్రత్తి వేసిన కమతం చుట్టూ కనీసం 5 వరసలు లేదా 20 శాతం కమతం విస్తీర్ణంలో(ఏది ఎక్కువైతే అది) బిటి లేని అదే రకం ప్రత్తి విత్తనాన్ని నాటాలి.దీనిని రెఫ్యూజి బెల్టు అంటారు.
- ప్రత్తి అనుమతించిన బిటి ప్రత్తి రకం విత్తనాల ప్యాకెట్ లో,రేఫ్యుజీ ప్రాంతంలో నాటుటుకు సరిపోయే బిటికాని అదే రకం విత్తనాల ప్యాకెట్ కలిగి వుండాలి.
- ప్రతి బిటి విత్తనాల ప్యాకెట్ మీద బిటి ప్రత్తి రకం వివరాలు,మార్పిడి చేసిన జన్యు పేరు,జిఇఎసి వారి ఆమోదపు వివరణ,భౌతిక,జన్యు స్వచ్చత,సాగుకు అవలంబించవలసిన సా౦ద్రవ్యవసాయ పద్దతులు,సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితుల వివరాలు ఆయా ప్రాంతీయ భాషలలో ముద్రించాలి.
- విత్తనాలు సరఫరా చేసే కంపెనీలు,రైతులను,విత్తన డీలర్ల ను చైతన్య పరచే౦దుకు అవగాహన సదస్సులు,శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.
2.బిటి ప్రత్తి సాగులో పాటించవలసిన పద్దతులు
- బిటి ప్రత్తిలో శనగ పచ్చ పురుగును తట్టుకునే శక్తి వుండటం వలన,మొదట తయారైన కాయలు నిలబడి,మొదటి తీతలోనే అధిక దిగుబడి సాధించటానికి అవకాశం వుంది.
- బిటి ప్రత్తిని సాగు చేయటం ద్వారా,బిటి కాని అదే ప్రత్తి రకం కన్నా హెక్టారుకు దాదాపు 6-8 క్వింటాళ్ళ అధిక దిగుబడి సాధి౦చవచ్చు.
- బిటి ప్రత్తిని సాగు చేయటం వలన,పురుగు మందులపై ఖర్చు తగ్గించుకొనడం ద్వారా,అధిక నికరాదాయాన్ని పొందటానికి అవకాశం వుంది.
- బిటి ప్రత్తిని సమగ్ర సస్య రక్షణ విధానంలో ఉపయోగించుకొనడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు అధిక నికరాదాయాన్ని పొందవచ్చు.
- బిటి ప్రత్తిని సాగు చేయటం ద్వారా గులాబి రంగు పురుగు ఉధృతిని కూడ కొంత వరకు అరికట్ట వచ్చు.
3.బిటి ప్రత్తి సాగులో నున్న అపరోధాలు
- ప్రస్తుతము విడుదలైనటువంటి బిటి ప్రత్తి విత్తనాలు పొగాకు లద్దె పురుగు ఉధృతిని ఎట్టి పరిస్థితులోను నిరోధించలేవు.
- బిటి ప్రత్తిలో బిటి ప్రభావం 100-110రోజుల వరకు మాత్రమే వుంటుంది.
- తీవ్ర వర్షాభావ పరిస్థితులు మరియు అధిక వర్షాలలాంటి ప్రకృతి వైపరీత్య పరిస్థితులలో బిటి ప్రభావం అనుకొన్న రీతిలో ఉండదు.
- బిటి ప్రత్తి లో రసం పీల్చే పురుగులను నిరోధించే శక్తి లేదు,అంతేకాక రసం పీల్చే పురుగుల ఉధృతి అధికంగా వున్నట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
- బిటి విషప్రభావము పూలు,కాయలు మరియు మొగ్గల కంటే ఆకులలో ఎక్కువగా వుండటం గమనించడం జరిగింది.దాని వలన ఆకులు కాకుండా,మొక్కలలోని మిగతా భాగాలను పురుగులు ఆశి౦చినపుడు తగిన ఫలితాలను ఇవ్వడం లేదు.
- బిటి ప్రత్తి లో తెగుళ్ళ ఉధృతి,బిటికాని ప్రత్తిలో కంటే అధికంగా వున్నట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
4.బిటి సాగు విధానంలో మెళుకువలు
- బిటితో పాటుగా బిటి లేని అదేరకం ప్రత్తిని అంటే రేఫ్యుజియా(ఎరపంటను)బిటి పొలం చుట్టూ 5వరసలు వేయాలి.అట్లు వేయనిచో,పురుగులు అధిక నిరోధక శక్తిని పెంచుకోవటానికి ఆస్కారం ఉంటుంది.
- సాధారణంగా బిటి ప్రత్తిలో మొక్క ఎదుగుదల బిటి లేని అదేరకం ప్రత్తి కంటే తక్కువ వుంటుంది కాబట్టి మొక్కలకు వరుసలకు మధ్యదూరం,పెరుగుదలను బట్టి తగ్గించికొని ఎకరాకు మొక్కల సంఖ్యను పెంచుకోవాలి.
- బిటి ప్రత్తి ముందు పక్వానికి వస్తుంది కాబట్టి నత్రజని మరియు పొటాష్ ఎరువుల వాడకాన్ని ముందు నుండి మొదలు పెట్టాలి.అధిక వర్షాల లాంటి ప్రతికూల వాతావరణం పరిస్థితులు ఏర్పడినపుడు,సిఫారసు చేసిన మోతాదుతో పాటుగా1/3వ వంతు మోతాదు అధికంగా పంటకు అందించాలి.బెట్ట పరిస్థితులు ఏర్పడినపుడు,నత్రజని మరియు పొటాష్ ఎరువులను పిచికారి రూపంలో అందించాలి.అంతే కాకుండా మొక్క ఎదుగుదలను బట్టి,పూలు,పిందె,కాయ దశలలో 3నుండి 4సార్లు నత్రజని మరియు పోటాష్ లను పిచికారి రూపంలో అందించాలి.
- రసం పీల్చే పురుగుల నివారణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.అవసరాన్ని బట్టి,కీటకనాశనుల పిచికారి సంఖ్యను పెంచుకోవాలి.విధిగా విత్తనశుద్ది చేయాలి.అంతేకాకుండా,ఎదిగిన పైరుపై సాంప్రదాయేతర పురుగులు కనపడినట్లైతే వెంటనే తగు నివారణ చర్యలు చేపట్టి ,వాటి ఉధృతి పెరగకుండా చూడాలి.
- తెగుళ్ళు కనపడిన ప్రధమ దశలోనే సిఫారసు చేసిన విధంగా నివారణ చర్యులు చేపట్టాలి.
- బిటి ప్రత్తి రకాలలో పైరు ధాతు లోపానికి ఎక్కువగా గురికావడానికి అవకాశం వుంది.అందువలన సిపారసు చేసిన విధంగానే కాకుండా అవసరాన్ని బట్టి లోపాన్ని గుర్తించగానే తగిన నివారణ చర్యులు చేపట్టాలి.
- వీటన్నిటితో పాటుగా,బిటి ప్రత్తిలో పంటకాలము తగ్గుతుంది.కాబట్టి ప్లానొఫిక్స్ లాంటి పెరుగుదలను నియంత్రించే హార్మోనులను ఉపయోగించాలి.