వేరుశానగానూనె,నువ్వుల నూనె కంటె కూడా ప్రొద్దుతిరుగుడు నూనె శ్రేష్టమైనది.దీని నుండి వనస్పతి కూడా తయారు చేస్తారు. వార్నష్,సబ్బు ,కలప పరిశ్రమల్లో కూడా ఈ నూనెను విస్తారంగా ఉపయోగిస్తున్నారు.నూనె తీసిన తర్వాత వచ్చే పిండి పశువుల దాణాగా ఉపయోగిపడుతుంది. సువాసన కలిగిన లీనోలిక్ ఆమ్ల౦ ఎక్కువగా ఉండి,లినోలిక్ ఆమ్లం లేక పోవటం వలన ప్రొద్దు తిరుగుడు పంట చాల ఆదరణలోకి వచ్చింది..దీని నూనె గుండెపోటుగల వారికి మంచిది. మన రాష్ట్రంలో ఈ పంటను 4.91 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు.సాలీన 333 వేల టన్నుల దిగుబడి వస్తుంది.సగటు ఉత్పాదకత ఎకరాకు 271కిలోలు.ఆంధ్రప్రదేశ్ దేశ౦లోని ప్రొద్దుతిరుగుడు విస్తీర్ణంలో'3 వ స్థానం,ఉత్పాధకతలో 5వ స్థానంలో ఉంది.