ఈ తెగులు ప్రొద్దు తిరుగుడు పండిస్తున్న అన్ని ప్రాంతాల్లో ఆశించి విపరీత నష్టం కలుగ జేస్తుంది.ఇది వర్షాకాలం,చలి కాలంలో ఎక్కువగా ఆశిస్తుంది.వాతావరణ౦ అనుకూలి౦చినట్లైతే పంట వేసిన 50-60 రోజుల వరకు ఈ తెగులాశిస్తుంది.ముదురు గోధుమ రంగు లేదా నల్లటి గుండ్రని లేదా అందాకారపు మచ్చలు మొదట ఆకుల పై ఏర్పడతాయి.ఈ మచ్చలు చుట్టూ పసుపు పచ్చని వలయాలు ఏర్పడి ,మచ్చల మధ్య భాగం బూడిద రంగులో వుంటుంది.తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కలిసి పోయి ఆకులు మాదిపోవటమే గాకా పువ్వు కుళ్ళిపోయే అవకాశం ఉంది.దీనివల్ల గింజ నాణ్యత తగ్గి మొలక శాతం తగ్గిపోతుంది. ఈ తెగులు లక్షణాలు ఆకుల పైనే కాక ఆకు కాడలు ,కాండం ,పువ్వు వెనకటి పచ్చని భాగాలు ,పూరేకులపై కనిపిస్తాయి. కాండం మీద మచ్చలేర్పడినపుడు వాటి మధ్య భాగం చీలిపోయివుంటుంది.
చలికాలంలో తెగులు తీవ్రత ఎక్కువగా ఉండి అధిక నష్టం కలుగ జేస్తుంది.మొదట తెగులు లక్షణాలు క్రింద ఆకులపై చిన్న వర్ణపు పొక్కులుగా ఏర్పడి ,తర్వాత పై ఆకులకు ,పువ్వులోని పచ్చని భాగాలకు వ్యాపించి ఎరుపు రంగుకు మారి ఎండిపోతాయి.పై తెగుళ్ళ నివారణకు పంట అవశేషాలు మరియు శిలీ౦ద్రానికి ఆశ్రయ మిచ్చే ఇతర కలుపు మొక్కల నిర్మూలను ,థైరమ్ లేక కాప్టాన్ ౩గ్రా.కిలో వత్తనానికి కలిపి విత్తనా శుద్ద,బి.యస్.హెచ్-1 వంటి ఆకుమచ్చ తెగులును తట్టుకునే రకాల సాగు మరియు మా౦కోజెబ్ లేక జినెబ్ 2గ్రా.లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఈ తెగులు పూత దశలో ఎక్కువగా వర్షాలు పడినపుడు ఆశిస్తుంది.మొదట మొక్క చివరి భాగంలో మరియు పువ్వు కింద ఉన్న ఆకులు శిలీ౦ద్ర౦ ఆశించటం వలన ఎండిపోతాయి.పువ్వు క్రింద ఉన్న భాగాలు నీటి లో తడిచినట్లుండి తర్వాత గోధుమ రంగుకు మారుతాయి.దీని నివారణకు ఫెన్దియాన్ 1మి.లీ మరియు నీటిలో కరిగేగంధకం ౩ గ్రా లీటరు నీటికి కలిపి పువ్వు దశలో 10 రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారి చేయాలి.
ఈ తెగులు సోకిన ఆకుల మధ్య ఈనె వెంట పత్రహరితం కోల్పోయి ,ఈ నెలు ఉబ్బి ఆకులు క్రిందకు ముడుచుకొని ఉంటాయి.ఈ ఆకులు ,ఆకుపచ్చ రంగు పొదలతో ఉంటాయి.ఇటువంటి ఆకు అడుగుభాగాన తెల్లని బూజులాంటి శిలీ౦ద్ర వు పెరుగుదల ను గమనించవచ్చు.పంట మార్పిడి ,పంట అవశేషాల నిర్మూలన ,మెటలాక్సిల్ ౩గ్రా కిలో విత్తనానికి కలిపి విత్తనా శుద్ధి మరియు మెటాలాక్సిల్ ఎం.జడ్.2గ్రా లేక కాపర్ ఆక్సీక్లో రైడ్ ౩గ్రా.లీటరు నీటికి కలిపి చల్లి ఈ తెగులు ను అరికట్టవచ్చు.
ఈ తెగులు పైరును అన్ని కాలాల్లో ,ఏ దశలోనైనా ఆశించవచ్చు .ఇది వైరస్ వాళ్ళ వచ్చే తెగులు తామర పురుగుల (త్రిప్స్)ద్వారా ఈ తెగులు పొలమంతా వ్యాపిస్తుంది.ఈ తెగులు సోకినపుడు ఆకుల మధ్య ఈనె దగ్గరగా ఉండే భాగం ఎండిపోయి మొదట బూడిద రంగులోను .తర్వాత నల్లగా మారి వంకరలు తిరుగుతుంది. తర్వాత ఆకు కాడకు,కాండనికి,పువ్వుకు వ్యాపించి నల్లగా మాడి ఎండిపోతుంది.లేత మొక్కలలో ఈ తెగులు వస్తే మొక్కలు సరిగా పెరగక గిడసబారి ఎండిపోతాయి.పూత దశలో వస్తే,పువ్వు పూర్తిగా విచ్చుకోక,మెలిక తిరిగి,వంకర టింకరగా మారిపోతుంది.పుష్పభాగాలు దెబ్బతిని విత్తన వృద్ది జరగదు.