విత్తిన 30,40రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి.విత్తే ముందు ఫ్లుక్లోరాలీన్ 45 ఎకరాకు లీటరు చొప్పున పిచికారి చేసి భూమిలో కలియ దున్నాలి లేదా పెండిమిథాలిన్30 ఒక లీటరు లేదా అలాక్టోర్ 50 1.5 లీటరు చొప్పున ఎదో ఒక దానిని విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి.విత్తిన 20,25 రోజులప్పుడు గోర్రుతో అంతర కృషి చేయాలి.