*మొవ్వకుళ్ళు తెగులు(బడ్ నెక్రొసిస్ వైరస్ తెగులు)
ఇది వైరస్ తెగులు,తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది.
లేత ఆకులపై నిర్జీవ వలయాలు లేక చారలు కనిపిస్తాయి.ముదురు ఆకుల్లో ఈ లక్షణాలు కనిపించవు.
లేత దశలో తెగులు ఆశిస్తే మొక్కలు కురుచబడి,ఎక్కువ రెమ్మలు వస్తాయి.ఆకులు చిన్నవిగా అయి లేత ఆకుపచ్చ మచ్చలు కల్గి పాలిపోయి ఉంటాయి. 15రోజుల తర్వాత తెగులు ఆశిస్తే మొవ్వు ఎండిపోయి,కుళ్ళిపోతుంది.క్రమంగా మొక్క అంతా ఎండిపోతుంది.
వేర్లు,ఊడలు,కాయల మీద మచ్చలు ఏర్పడి కుల్లిపోతాయి.ఈ తెగులు సోకిన మొక్కలనుండి వచ్చిన వేరుశనగ విత్తనాలు చిన్నవిగా ఉండి,ముడుచుకొని ఉంటాయి.
నివారణకు తెగులును కొంతవరకు తట్టుకునే కదిరి-3,ఆర్ 8808,వేమన,ఐ.సి.జి.యస్-రకాలను సాగుచేయాలి.
వేరుశనగతో సజ్జ పంటను 7:1 నిష్పత్తిలో అంతర పంటగా వేయాలి.
విత్తిన 20రోజుల తర్వాతతామర పురుగుల(త్రిప్స్)వ్యాప్తి అరికట్టడానికి మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ.లేక డైమిధోయేట్ 2మి.లి.లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.