
వేరుపురుగు
వేరు పురుగు యొక్క తల్లి పురుగులు (పెంకు పురుగులు)తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిలో నుంచి బయటకు వచ్చి పొలంలో వున్న వేప/రేగు చెట్లను ఆశిస్తాయి.
బాగా ఎదిగిన వేరుపురుగు లార్వా 'ఈ' ఆకారంలో వుండి మొక్క వేర్లను కత్తిరిస్తుంది.
తేలికపాటి తువ్వ నేలల్లో ఎక్కువగా ఆశిస్తుంది.
వేరుపురుగు ఆశి౦చిన మొక్కలు వాడి,ఎండి చనిపోతాయి.మొక్కను పీకితే సులువుగా ఊడి వస్తాయి.మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి.
బెట్ట పరిస్థితులలో ఒక్క సారి పంట చచ్చి పోతుంది.
విత్తనము 1కి.గ్రా కు 61/2 మి.లీ క్లోరిపైరి ఫాస్ పట్టించి విత్తవలెను.
150 కి.గ్రా.ల వేపపిండి దుక్కిలో వేయవలెను.
లోతు దుక్కి చేయడం వలన వేరుపురుగు కోశస్థదశబయట పడి పక్షులు వాటిని తింటాయి.