ఇతర విషయాలు:

1. వరి విత్తనాల్లో నిద్రావస్ధను తొలగించండి

కోత కోసిన వె౦టనే విత్తనాలను వాడుకోవాల౦టే వరి గి౦జల్లోని నిద్రావస్థను తొలగించి అధిక మొలకశతం రాబట్టటానికి,లిటరు నీటికి తక్కువ నిద్రావస్ధ వున్న విత్తనాలకైతే 6.3 మి.లీ .లేదా విజేత లా౦టి ఎక్కువ నిద్రావస్ధ వున్నవిత్తనాలకైతే 10 మి.లీ. గాఢ నత్రి కామ్లం కలిపి ఆ ద్రావణ౦లో 24 గ౦టలు నాసబెట్టీ మరో 24 గ౦టలు పాటు మ౦డెకట్ఠాలి.

2.జింకు లోప లక్షణాలు

మొక్క పై నుంచి ౩ లేదా 4 ఆకుల్లో మధ్య ఈనెపాలి పోతుంది.నాటిన 2 నుంచి 4లేదా 6 వారాల్లో ముదురాకు చివర్లలో,మధ్య ఈనెకు ఇరుప్రక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చులు కనబడతాయి. ఆకులు చిన్నవిగా,పెళుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి .మొక్కలు గిడసబారిడ దుబ్బుచేయపు. నత్రజని ఎరుపులు వేసినప్పుతికి పైరు పచ్చబడదు.

సవరణ

ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి,రెండు పంటలు పండించేట పండించేటట్లైతే ప్రతి రబీ సిజన్లో,అఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేటు వేయాలి లేదా పైరుపై జింకు లోపం కనిపించగానే లీటరు నీటికి 2గ్రా. చిలేటడ్ జింకు సల్ఫేటును కలిపి 5 రోజుల వ్యవధిలో 2,౩ సార్లు పిచికారి చేయాలి.

గమనిక

భాస్వరం ఎరుపుతో జింకు సల్ఫేటును కలిపివేయరాదు.కనీసం ఒక రోజున వ్యవధీ ఉండాలి.కలిపివేసే రసాయనిక చర్య వల్ల ఫలితం ఉండదు.

౩.ఇనుము లోప లక్షణాలు

లేత చిగురకులు తెల్లగా మరి ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు ఇటుక రంగు మచ్చలు వచ్చి ఆకులు నిర్జ్జివమవుతాయి. పిలకలు తగ్గి, ఎత్తుపెరుగదు. వార్షధార ననారుమళ్ళులో,మెట్టవరిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది

సవరణ

దంప నారుమళ్ళు పోస్తే ఈ సమస్యరాదు.లీటరు నీటికి 20 గ్రా అన్నభేది, 2 గ్రా నిమ్మ ఉప్పు కలిపి పిచికారి చేయాలి. పగటి ఉష్టోనగ్రత ఎక్కువగా ఉన్నపుడు తక్కువ గాఢత కల్గిన ద్రావణాన్ని (0.5—1.0%) వాడాలి.

4. రైతుస్ధాయిలో వరి విత్తనోతత్తి

వరిమరియుఇతరఏదేని పంటదిగుబడులను పెంచెందుకు ధృవీక\రింపబడిన, నాణ్యత గల్లిన మంచివిత్తనాన్ని వాడాలి. మంచి విత్తనం అనగానే శుభ్రత, నాణ్యతతో పాటు బాగా మొలకెత్తే స్వబావం (85 శాతం)గల్లి ఆరొగ్యవంతంగా పెరిగిమంచి దిగుబడి నివ్వాలి.తక్కువ పరిమాణంలో నాణ్యమెన విత్తనాన్ని ప్రతిరై తుతనకుతానేతయారుచేసుకొంటేతక్కువ ఖర్ఛర్చ్హతోమంచిరాబడి పోందగలరు.

విత్తనోత్పత్తి లో ప్రధానంగా

  • 1. బ్రీడరు విత్తనం (జన్యుస్వచ్చత నూరుశాతంగా ఉండి శాస్తవేత్తల పర్యవేక్షణలో పరిశోధనా స్ధానాల్లో ఉత్పత్తి చేయబడుతుంది).
  • 2. ఫౌ౦డేషన్ విత్తనం(బ్రీడరు విత్తనం నుండి ఉత్పత్తి చేయబడుతుంది)
  • 3.దృవికరింపబడ్డ విత్తనం (సర్టిఫైడ్ సీడ్) ( ఫౌ౦డేషన్ విత్తనం ను౦డి ఉత్పత్తి చేయబడుతుంది) వరి స్వపరాగ సంపర్కంతో వృద్ధి చెరదే ప౦ట గనుక సులభ౦గా నాణ్యమెన విత్తనాన్నిఉత్పత్తి ఛేయవచ్చు. వరి వ౦గడాలు కొ౦త కాల౦ సాగుచేసిస తర్వాత ముఖ్య౦గా ఇతర రకాలతో కల్తీ జరుగటర వలన , పైరుపై తెగుళ్ళ ప్రభావర వలన మరియు కొద్ది మేర పరపరాగ సరపర్య౦ వలస విత్తన౦ మొక్క స్వచ్ఛత, నాణ్యత దెబ్బతిని దిగుబడి శక్తిలో మార్పులు వచ్చి , ఆశి౦చిన మేరకు దిగుబడి రాదు.ఈ మార్పులకు వాతావరణ ప్రభవం, స్వల్ప జన్యు మార్పులు , ఉత్పరివర్తనాలు కూడ దోహద౦ చేస్తాయి.మ౦చి నాణ్యత కొరకు, జన్యు / బహ్య శుభ్రతకై తగు జాగ్రత్తలు పాటి౦చి రైతులునవ్ స్వయరగా గాని/గ్రామ స్ధయిలో గాని ఉత్పత్తి చేసి ఖర్చు తగ్గిరచుకోవడమేగాక అధిక దిగుబడి పొరదవచ్చు.

5. శ్రీవరి సాగు పద్దతి


agriculture ap

1. విత్తనము :

సాధారణ పద్ధతిలోఎకరాకు 20కిలోల విత్తనం అవసరమయితే 'శ్రీ" పద్దతిలో2కిలోల విత్తనం సరిపోతుంది .రె౦డు కిలోలవిత్తనాన్నిఒకసె౦టు భూమిలో చల్లి నారుపె౦చితే ఎకరాకుసరిపోతు౦ది.


agriculture ap

2. నారుమడి తయారి:

భూమిని మెత్తగా దున్ని,దమ్ముచేసి, ఎత్తుగా తయారుచేసే ,చుట్టూ కాలువ తీయాలి.తడిమట్టి జారిపోకుండా నారుమడి చుట్టూ చెక్కతోకాని,బో౦గులతోగానిఊత౦ ఏర్పటుచేయాలి.


agriculture ap

౩.సే౦ద్రియ ఎరుపులు:

సేంద్రియ ఎరువులు బాగా వాడి భూసార౦ పె౦చాలి. ప్రస్థుత పరిస్థితుల్లో రసాయనికఎరువులు కూడ పైరుకు తొలిదశలో వాడవచ్చు.కాని,ముందు, ము౦దు సే౦ద్రియ ఎరువులువాడి,రాసాయనిక ఎరువుల వాడకం తగ్గి౦చాలి


agriculture ap

4.విత్తన౦ చల్లుట :

నారుమడి మీద 24గంటలునానబెట్టి,24 గ౦టలు మ౦డే కట్టి మొలకెత్తిన విత్తనాన్ని పలుచగా చల్లాలి.విత్తనాలపైన మరలా మరోపోర పశువుల ఏరువు చల్లి గడ్డితో కప్పాలి.మొలక వచ్చిన వెంటనే గ'డ్డినితీసీవేయాలి.రొజూనీరు చల్లుతూ ఉంటే 8 రోజులలో వరినారు 2-౩ ఆకులతో దృడ౦గా పెరుగుతు౦ది.


agriculture ap

5. నీరు చల్లడ౦:

వరిబాగా పెరిగిఎక్కువ దిగుబడి నివ్వాల౦టే పోల౦లో ఎప్పడూ నీరు నిలువ ఉ౦డాలని రైతులు భావిస్తారు. పరి నిటిలో బ్రతకగలదు కాని నీటిమొక్కు కాదు . పొల౦లో నీరు నిల్వఉన్నప్పడు వరివ్రేళ్లలో గాలి స౦చులు తయారుచేయటానికి చాలా శక్తిని వినిమోగిస్తు౦ది. అంటే ధాన్యరి తయారుచేయటానికి ఉపయోగపడాల్సిన శక్తి గాలి స౦చులు తయారు చేసి తద్వారా బ్రతకడానికి వాడుకు౦టు౦ది. అ౦తేగాక వరిలో పూత దశకు వచ్చేటప్పటికి ,70 శాత౦ వేర్ల కొసలు కృశించి పోషకాలను తీసుకోలేని స్థితిలో ఉంటాయి . శ్రి పద్ధతి లో వరి పొలంలో నీరు నిలువ ఉ౦డకుండా చూడాలి.కాబాట్టీ ఈ పద్ధతిలో వరి సాగుకు సాధారణ౦గా పరి ప౦డి౦చడానికి అవసరమయ్యే నీటిలో సగ౦ ను౦డి మూడో వంతు నీరు ఘాషైతల సరిసోతులది- నారుమడి పదును పోకుండా ఉ౦డేటట్టప్రోద్దున సాయ౦కాల౦ కురడతో గాని రోజ్ వాటర్ కాన్ తోగాని రోజు నీరు పలుచగా చల్లాలి మొలక వచ్చిన వె౦టనే గడ్డిని తీసివేయాలి. రోజూ నీరు చల్లుతూ ఉంటే 8 రోజులలో వరినారు 2-3 అకులతో దృడ౦గా పెరుగుతు౦ది.


agriculture ap

6. శ్రీపద్దతిలో వరి:

శ్రీ సాగులోని 6 యాజమాన్య౦ పద్ధతులు తూ .చా . తప్పకుండా పాటిస్తే ఒక్కోమొక్కకు 50ను౦డి100కి పైగా బలమైన పిలకలు వచ్చిఅన్ని కూడా ఓకేసారి పొట్టిదశకు చేరి పెద్ద పెద్ద కంకులు వేస్తాయి. శ్రీపద్ధతి భూమిలోని సూక్ష్మజీవులను బాగా వృద్ది చేస్తుంది. ఈ సూక్ష్మజీవులుసహజంగానే పైరుకు కావాలసిన పోషక పదార్దాలను అందజేస్తాయి. కాబట్టి ఈ పద్ధతి భూసారన్ని పెంచుతూ సుస్థిర దిగుబడుల నివ్వగాలదు.


agriculture ap

7. శ్రీవరి సాగు పద్ధతి :

(తక్కువ నీటితోఅధికదిగుబడులకు) శ్రీవరి సాగు పద్ధతిలో తక్కువ ఖర్చు మరియు తక్కువ నీటితో అధిక దిగుబడులు సాది౦చవచ్చు. శ్రీవరి సాగు పద్ధతి, 1980 దశకంలో మడగాస్కర్ దేశ౦లో రూపో౦ది౦చబడి౦ది. చైనా, ఇ౦డోనేషీయా, క౦బోడియా, థాయిలా౦డ్, బంగ్లాదేశ్, శ్రీల౦క మరియు భారతదేశంలో ముఖ్య౦గా మన రాష్ట్రంలో చాలా మ౦ది రైతులు ఈ పద్ధతిని అవలరిభిస్తున్నారు.సాధారణ పద్ధతిలో ఎకరాకు 20 కిలోల విత్తన౦ అవసరమయితే 'శ్రీ' పద్ధతి లో 2 కిలోల విత్తనం సరిపోతు౦ది. ఈ పద్ధతిలో రసాయనిక ఎరువుల మరియు పురుగు మ౦దుల ఖర్చు కూడా చాలా తక్కువ. 'శ్రీ' పద్ధతిలో ,వరి పైరు సహజ౦గా పెరగడానికి దోహదపడుతు౦ది కాబట్టి వరి చాలా ఆరోగ్య౦గా ఉ౦టు౦ది. వేర్లు విస్తార౦గా వ్యాఫై చె౦ది, లోతుకు చొచ్చుకుపోయి, భూమి లోపలి పొరల ను౦డి పోషక పదార్ధాలను తీసుకోగలుగుతాయి.


agriculture ap

8.నారు పికడం:

నారుమడి నుండి నారుపికకుండా, చిన్నపెంకతో గాని చిన్న మూతతో గాని మొక్క కుదుళ్ళ నుంచి మట్టితో సహా నారుని జాగ్రత్తగా తీయాలి.


agriculture ap

9.నీటి యూజమాన్య౦:

నీటి యూజమాన్య౦ చాలా జాగ్రత్తగా చేపట్టాలి.పొల౦ తడిగా ఉ౦డాలి గాని నీరు నిలువకూడదు. నీరు ఎక్కు వెతే బయటకు పోవటానికి వీలుగా ప్రతి 2 మీటర్లకి ఒక కాలువ ఏర్పాటు చేయాలి. మధ్యమధ్యలో పోల౦ అరితే నీరు పెడుతు౦డాలి. దా౦తో వేర్లు ఆరోగ్య౦గా వృద్ధి చె౦దుతాయి.


agriculture ap

10.వీడర్ తొలడ౦ :

పొలంలో నీరు నిల్వకుండా చూస్తా౦ కాబట్టి, కలుపు సమస్య ఎక్కువ. కలుపు నివారణకు, రోటరీ/కోనో వీడార్ తో, నాటిన 10 రోజులకు ఒకసారి,ఆ తర్వాత 10 రోజుల వ్యవధిలో మరో మూడుసార్టు నేలను కదిలిస్తే కలుపు మొక్కలు నేలలో కలిసి పోతాయి. ఈ విధ౦గా కలియబెట్టడ౦ వలన ప్రతిసారీ షుమారు హెకారుకు 1 టన్ను పచ్చిరొట్ట భూమికి చేరుతులది. రోటరీ/కోనో వీడర్ వాడకం వలన వేరుకు బాగా ఆక్సజస్ అ౦దుతు౦ది. దా౦తో సూక్ష్మజీవులు అభివృద్ది చె౦ది నత్రజనిని స్దిరీకరిస్తాయి. రెండుసార్ల కంటే ఎక్కువగా రోటరీ/కోనొ వీడర్ తో పనిచేసినప్పడు ఒక్కోక్కసారికి హెకారుకు 2 టన్నుల అధిక దిగుబడి వస్తు౦దని రైతుల అనుభవ౦ తెలియజేస్తున్నది.

agriculture ap

11.జాగ్రత్తగా నాటట౦:

నారుమడి ను౦డి మొక్కను జాగ్రత్తగా, వేరు, బురద, గి౦జతో సహ తీపి పొలంలో పైపైన నొక్కి పెట్టాలి. లోతుగా నాటకూడదు.దీనివలన పీకేటప్పడు సహజంగా ఉ౦డే తీవమైన వత్దిడికి మొక్క గురి కాకు౦దా బ్రతికి, త్వరగా పెరిగి అధిక స౦ఖ్యలో పిలకలు చేస్తు౦ది.


agriculture ap

12.లేతనారు నాటట౦:

8 ను౦చి 12 రోజుల వయస్సు గుల 2ఆకుల నారును మాతమే నాటాలి. దీని వలన అధిక స౦ఖ్యలో పిలకలు వేస్తాయి. వేర్లు బాగా వ్యాపిస్తాయి.


agriculture ap

13. మార్కర్ గీయడం:

సాధారణ పద్ధతుల్లో వరి నాటేటప్పడు భూమిని తయారు చేసిసట్టుగానే శ్రీ పద్ధతిలో వరి నాటటానికి కూడా తయూరుచేయాలి. అయితే,ఈ పద్ధతిలో పొల౦ తడిగా ఉ౦డాలిగాని, నీరు నిలువ ఉ౦డకూడదు కాబట్టీ నీరు ఎక్కడైనా వె౦టనే పోవడానికి ఏర్చాటు చేయాలి మరియు పొలాన్ని బాగా చదును చేయాలి. దమ్ముచేసి చదును చేసిన పొల౦లో చేతితో లాగే రోలర్ మార్క తో 25x25 సె౦.మీ. దూర౦లో నిలువుగా మరియు అడ్డ౦గా గితలు గీయాలి.