శ్రీ వరి సాగు పద్ధతి
agrinaru

లేతనారు నాటటం

8 నుంచి 12 రోజుల వయస్సుగల రెండు ఆకుల నారును మాత్రమే నాటాలి. దీనివలన అధిక సంఖ్యలో పిలకలు వేస్తాయి.వేర్లు బాగా వ్యాపిస్తాయి.


agriculture ap

జాగ్రత్తగా నాటటం

నారుమడి నుండి మొక్కను జాగ్రతగా,వేరు,బురద,గింజతో సహా తీసి పొలంలో పైపైన నొక్కి పెట్టాలి.లోతుగా నాటకూడదు.దీనివలన పీకేటప్పుడు సహజంగా ఉండే తీవ్రమైన వత్తిడికి మొక్క గురి కాకుండా బ్రతికి,త్వరగ పెరిగి అధిక సంఖ్యలో పిలకలు చేస్తుంది.


agriculture ap

కలుపు నివారణ

పొలంలో నీరు నిలవకుండా చూస్తాం కాబట్టి,కలుపు సమస్య ఎక్కువ.కలుపు నివారణకు,రోటరీ/కోనో వీడర్ తో,నాటిన 10 రోజులకు ఒకసారి,ఆ తర్వాత 10రోజుల వ్యవధిలో మరో మూడుసార్లు నేలను కదిలిస్తే,కలుపు మొక్కలు నేలలో కలిసి పోతాయి.ఈ విధంగా కలియబెట్టడం వలన ప్రతీసారీ సుమారు హెక్టారుకు 1 టన్ను పచ్చిరొట్ట భూమికి చేరుతుంది.రోటరీ/కోనో వీడర్ వాడకం వలన వేరుకు బాగా ఆక్సీజన్ అందుతుంది. దాంతో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది నత్రజనిని స్థీరీకరిస్తాయి.రెండుసార్ల కంటే ఎక్కువగా రోటరీ/కోనో వీడర్ తో పనిచేసినప్పుడు ఒకొక్కసారికి హెక్టారుకు 2 టన్నుల అధిక దిగుబడి వస్తుందని రైతుల అనుభవం తెలియజేస్తున్నది.



agriculture ap

నీటి యాజమాన్యం

నీటి యాజమాన్యం చాలా జాగ్రత్తగా చేపట్టాలి.పొలం తడిగా ఉండాలి గాని నీరు నిలవకూడదు.నీరు ఎక్కువైతే బయటకు పోవటానికి వీలుగా ప్రతి 2 మీటర్లకి ఒక కాలువ ఏర్పాటు చేయాలి.మధ్యమధ్యలో పొలం ఆరితే నీరు పెడుతు౦డాలి.దాంతో వేర్లు ఆరోగ్యంగా వృద్ధి చెందుతాయి.


agriculture ap

సేంద్రియపు ఎరువులు

సేంద్రియపు టెరువులు బాగా వాడి భూసారం పెంచాలి.ప్రస్థుత పరిస్థితుల్లో రసాయనక ఎరువులు కూడ పైరుకు తొలిదశలో వాడుకోవచ్చు.కాని,ముందు,ముందు సేంద్రియపు టెరువులు వాడి ,రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి.