వర్షాలు ఎక్కువగా ఉన్న సమయాల్లో ఈ తెగులు వ్యాప్తి అధికంగా ఉంటుంది.ఆకులపై పసుపు రంగు చిన్న మచ్చలు ఏర్పడి అవి ముదురు గోధుమ రంగులోకి మారుతాయి.ఆకులు పసుపు బారి త్వరగా రాలి పోతాయి.దీని నివారణకు 20 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మరియు 2గ్రాముల స్త్రేప్టిసైక్లిన్ ను 10లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
వైరస్ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది.మొవ్వు లేత ఆకులు పసుపు రంగులో కి మారి ఎండిపోయి మొక్క ఎదుగుదలను అరికడుతుంది.కాయలు ఏర్పడవు .ఈ తెగులు లేత మొక్కలపై వచ్చినప్పుడు నష్టం తీవ్రంగా ఉంటుంది.తామర పురుగులను నివారించుకోవాలి.మోవ్వుకుళ్ళు తెగులును తట్టుకొనే జె.ఎస్335,ఎల్.ఎస్.బి3,పికె-1029 వంటి రకాలను సాగుచేయాలి.
ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.ఆకులు త్వరగా రాలి పోయి ఒంట దిగుబడులను గణనీయంగా తగ్గిస్తుంది.తెగులు తీవ్రంగా ఉన్న దశల్లో తుప్పు రంగు పొడి చేతికి అంటుంది.దీని నివారణకు హెక్సా కొనోజోల్ లేదా ప్రాపికానోజోల్ 1మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.తుప్పు తెగులుని తట్టుకునే రకాలైన పి.కె1029 వంటి రకాలను సాగు చెయ్యాలి.