జె.ఎస్335:

దీని కాల పరిమితి 90 రోజులు.మొక్క నిటారుగా మధ్యస్థ ఎత్తులో పెరుగుతుంది.పూత ఊదా రంగులో ఉంటుంది.కాయల పై నూగు ఉండదు.గింజ మధ్యస్థ౦గా ఉంటుంది.మొవ్వుకుళ్ళు తెగులు తట్టుకొంటుంది.మొలక శక్తిని ఎక్కువ కాలం నిలుపుకొంటుంది.దిగుబడి ఎకరానికి 8 నుండి10 క్వింటాళ్ళు.

ఎమ్.ఎ.సి.ఎస్450:

దీని కాలపరిమితి 100 రోజులు.మొక్క నిటారుగా ,మధ్యస్త ఎత్తులో పెరుగుతుంది.పూత ఊదా రంగులో ఉంటుంది.కాయ పై రాగి రంగు నూగు ఉంటుంది.గింజ మధ్యస్తంగా ఉంటుంది.ఎకరాకు దిగుబడి 8-10 క్వింటాళ్ళు.

ఎల్.ఎల్.బి.1:

అతి తక్కువ కాలంలో అంటే 65 రోజులకే కోత కు వచ్చే రకం.మొక్క పొట్టిగా ఉంటుంది.పూత తెలుపు రంగులో ఉంటుంది.కాయ పై రాగి రంగు నూగు తక్కువగా ఉంటుంది.గింజ లావుగా ఉంటుంది.ప్రత్తి -కంది పైర్లలో అంతర పంటగా అనుకూలమైన రకం .దిగుబడి ఎకరాకు 6 క్వింటాళ్ళు.

పి.కె472:

పంటకాలం 100 రోజులు .దిగుబడి ఎకరాకు 8-10 క్వింటాళ్ళు.

ఎమ్.ఎ.సి.ఎస్58:

దీని కాలపరిమితి 90-100 రోజులు .మొక్క నిటారుగా 65 సెం.మీ ఎత్తు పెరుగుతుంది.పూత ఊదా రంగులో ఉంటుంది.కాయ పై రాగి రంగు నూగు ఉంటుంది.గింజ మధ్యస్తంగా ఉంటుంది.ఎకరాకు దిగుబడి 8-10 క్వింటాళ్ళు.