తెగులు సోకిన కాండంపై పూర్తిగా లేదా అసంపూర్తిగా ఆకులుగా మరీనా పుష్పగుచ్చం ఏర్పడ్తుంది. తెగులు లక్షణాలు మొదట లేత మొక్కలపై 3-4 ఆకులు వేసే దశలో కనిపిస్తాయి. తెగులు సోకినా మొక్కల ఆకులు పసుపు రంగులోనికి మారతాయి . గాలిలో తేమ అధికంగా ఉన్న వాతావరణంలో ఆకుల అడుగుభాగాన తెల్లని భూజు పెరుగుదల కనిపిస్తుంది.తెగులు తీవ్రదసలో మొక్కలు గిడసబారి 30 రోజులలోపు చనిపోతాయి . తెగులు సోకినా మొక్కల్లో కంకులు పూర్తిగా లేదా పాక్షికంగా ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారిపోతాయి . దీని నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల మేటలక్సిల్ మందుతో విత్తన శుద్ధి చేయాలి . వ్యాధి సోకిన మొక్కలను ఏరి , కాల్చి వేయాలి .
తెగులు సోకిన కంకి నుండి గులాబి లేదా ఎర్ర రంగుగా ఉన్న తేనె వంటి చిక్కటి ద్రవం బొట్లుబొట్లుగ కారుతుంది. ఈ ద్రవంలో శిలింద్ర బీజాలు ఏర్పడతాయి. మొక్కలు పుష్పించే దశలో మబ్బులతో కూడిన ఆకాశం, వర్షపు తుంపరలు, వాతావరణం చల్లగా ఉండటం ఈ తెగులు వ్యాప్తికి దోహద పడుతుంది. దీని నివారణకు విత్తనాలను 2 % (20గ్రా/లీ) ను ఉప్పునీటి ద్రావణంలో శుద్ధి చేయాలి . కిలో విత్తానానికి 3 గ్రాముల తైరం మందు కలిపి విత్తన శుద్ధి చేయాలి . పైరు పూత దశలో మంకోజేబ్ (2.5 గ్రా/లీ.) లేదా కార్బండజిం (1 గ్రా/లీ.) ను వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.