1.ఐ.సి.టి.పి.-8203

పంటకాలం 80-85 రోజులు.దిగుబడి ఎకరాకు 8-10 క్వింటాళ్ళు. గింజలు లావుగా,తెల్లగా వుంటాయి .వెఱ్రికంకి తెగులును , బెట్టను తట్టుకుంటుంది.


2.డబ్ల్యు.సి.సి-75 (కాంపోజిట్) :

పంటకాలం 85-90 రోజులు.దిగుబడి ఎకరాకు 8-10 క్వింటాళ్ళు. పైరు 180 సెం.మీ. ఎత్తు కుదురుకు 2-3 పిలకలు వేస్తుంది. కంకి పొడవు 25-30 సెం.మీ. కంకులు లావుగా ఉండి. గింజలు లావుగా బూడిద రంగులో వుంటాయి . వెఱ్రికంకి తెగులును తట్టుకుంటుంది . అన్ని ప్రాంతాలకు అనుకూలం.


3.ఐ.సి.యమ్.వి-221 :

పంటకాలం 85-90 రోజులు.దిగుబడి ఎకరాకు 8-10 క్వింటాళ్ళు. వెఱ్రికంకిని తట్టుకోగల కాంపోజిట్ రకం .అన్ని ప్రాంతాలకు అనుకూలం .


4.ఐ.సి.యమ్.హెచ్ - 356 :

పంటకాలం 85-90 రోజులు.దిగుబడి ఎకరాకు 8-10 క్వింటాళ్ళు. పైరు 150 సెం.మీ. ఎత్తు ఎదిగి కంకులు బూడిద రంగులో వుంటాయి.


5.పి.హెచ్.బి - 65 :

పంటకాలం 77-81 రోజులు.దిగుబడి ఎకరాకు 10-12 క్వింటాళ్ళు. పైరు 200 సెం.మీ. ఎత్తు ఎదిగి ఆకుపచ్చగా ఉండి పశుగ్రాసమగా ఉపయోగపడ్తుంది.


6.జె.కె.బి.హెచ్ - 598 :

పంటకాలం 80-85 రోజులు. గింజ దిగుబడి ఎకరాకు 2 క్వింటాళ్ళు.


7.యమ్.ఎల్.బి.హెచ్ - 322 :

పంటకాలం 75-80 రోజులు.దిగుబడి ఎకరాకు 10-11 క్వింటాళ్ళు. పైరు రెండు మీటర్లు ఎత్తు పెరిగి రెండు లేదా మూడు కంకులు కలిగి పశుగ్రాసమగా కూడా ఉపయోగపడ్తుంది.


8.మల్లికార్జున :

పంటకాలం 80-85 రోజులు.దిగుబడి ఎకరాకు 8-10 క్వింటాళ్ళు. వర్షాభావ పరిస్తితులకు తట్టుకుంటంది.సజ్జ సాగు చేసే ప్రాంతాలకు అనుకూలం.


9.ఐ.సి.యమ్.హెచ్ - 451

పంటకాలం 85-90 రోజులు.దిగుబడి ఎకరాకు 8-10 క్వింటాళ్ళు. పైరు 180 సెం.మీ. సంకర రకం. పైరు 175 సెం.మీ. ఎత్తు ఎదిగి, 2-3 పిలకలు వేస్తుంది. గింజలు మద్యస్థ లావుగా బూడిద రంగులో ఉంటాయి. వెఱ్రికంకి తెగులును తట్టుకుంటుంది .అన్ని ప్రాంతాలకు అనుకూలం .