పిల్ల, తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకుల ను౦డి రసాన్ని పీల్చి వేస్తాయి. పురుగులు ఆశి౦చిస ఆకుల ము౦దుగా పాలిపోయి, తర్వాత దశలో ఎండిపోతాయి. తెల్లనల్లి ఆశిస్తే ఆకులు ముదురు ఆకుపచ్చ ర౦గుకు మారి ఈనెలు పొడవుగా సాగి క్రి౦ది వైపుకు ముడుచుకొని పోయి, దొనె ఆకార౦గా మారి పాలి పోతాయి.
మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డైమిథోయేట్ 2 మి.లి. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తెల్లనల్లి నివారణకు డైకోఫాల్ 5 మి. లీ.లేదా డైమిథోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పీచికారి చేయాలి.
తొలిదశలో చిన్న గొంగళి పురుగులు రెండు, మూడు లేత ఆకులను కలిపి గూడు కట్టీ లోపలి ను౦డి ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గోకి తినుట వలన ఆకులు ఎ౦డిపోతాయి. తర్వాత దశలో క్రిములు ఎదిగిన కొలది ఎక్కువ ఆకులను కలిపి గూడుగా చేసుకొని ఆకులను తి౦టాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పూతను, కాయల్లోని లేత గి౦జలను తీ౦టూ ప౦టకు సష్ట౦ చేస్తాయి.
మోనోక్రోటోపాస్ 1.6 మి.లి. లేదా ఎ౦డోసల్ఫాస్ 2 మి.లి. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లి. లిటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఆశి౦చిస ఆకులను పురుగులతో సహ ఏరి నాశన౦ చేయాలి.
క్రిములు లేత ముగ్గ,పూత తినివేయటం వలన మొగ్గలు పుప్పుగా, కాయలుగా ఏర్పడక గింజ కట్టక తాలు కాయలు ఏర్పడతాయి. ఆశించిన మొగ్గ మరియుపూత వాడి రాలిపోతుంది.
పురుగు అశించిన మొగ్గలి మరియుతాలు కాయలి ఏరినాశనం చేయాలి.మొగ్గ దశలో డైమిథోయేట్ 2 మి.లీ. లేదా ఎ౦డోసల్ఫాస్ 2 మి.లీ. లేదా మోనొక్రోటోఫాస్ 1.6 మి.లి. లేదా ఎసీఫేట్ 1గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తొలి దశలో చిన్న గొ౦గళి పురుగులు గు౦పులుగా ఆకులలోని పత్రహరితాన్ని గోకి తిని జల్లెకులుగా చేస్తాయి. ఎదిగిన గొ౦గళి పురుగులు ఇతర మొక్కల పైకి ప్రాకుతూ మొగ్గలకు, పువ్వులకు మరియు కాయలకు ర౦ధ్రాలను చేస్తు విత్తనాలను తినేస్తాయి.
ప౦టలోగ్రుడ్లు లేక గొ౦గళి పురుగులను గమని౦చిన వె౦టనే అకులతో సహ తీసివేసి నాశన౦ చేయాలి. ఎ౦డోసల్ఫాస్ 2 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్హె 1 గ్రా లీటరు నీటికి కలిపి పీచికారి చేయాలి.