నాట్లు వేసేటపుడు నీరు పలుచగా ఉండాలి. ఎండలు ఎక్కువగాఉంటే ఊడ్చిన వెంటనే 5 సెం.మీ.వరకు నీరు నిలగట్టాలి.మూన తిరిగిన రోజు నుండి పైరు దుబ్బు చేయటం పూర్త ఆయ్యే వరకు పొలంలోపలుచగాఅంటే 2-౩ సెం.మీ.నీరు౦డాలి.నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయదు .చిరుపోట్ట దశనుండి గింజ గట్టి పడే వరకు 5 సెం.మీ.లోతు వరకు నీరు౦చాలి. కోటకు 10 రోజులముందుగా నీటిని నెమ్మదిగా తగ్గి౦చి ఆరబెట్టాలి.