విత్తనము:

విత్తేకాలం మరియు విత్తే సమయం:

ఖరీఫ్ లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో జూన్ 15 జూలై 15వరకు,రబీ తెలంగాణా రాయలసీమ ప్రాంతాలలో అక్టోబర్ 15నుంచి జనవరి 15వరకు విత్తుకోవచ్చు.వర్షాభావ పరిస్థితుల్లో ఆగుష్టు లోపు విత్తుకోవాలి.


విత్తన మోతాదు:

ఎకరానికి సాధారణ రకాలకు 7కిలోలు ,పాప్కార్న్ మరియు మాధురి రకాలకు 4-5 కిలోల విత్తనం అవసరం.


విత్తన శుద్ధి:

కిలో విత్తనాన్ని 3గ్రాముల మా౦కోజెబ్ లేదా 5గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ తో విత్తన శుద్ధి చేయాలి.


విత్తే దూరం:

బోదె నాగలితో వరసుల మధ్య 60-75సె౦.మీ. మొక్కల మధ్య 20-25సె౦.మీ.ఎడం ఉండేటట్లు సాళ్ళు చేసుకోవాలి.బోదెసాళ్ళ కుడివైపు 1/3ఎత్తులో 2సెం.మీ లోతులో విత్తుకోవాలి.ఈ రకంగా ఎకరాకు 26,666మొక్కల సాంద్రతతో విత్తుకోవాలి.ప్రత్యేక రకాలకు సాలుకు సాలుకు మధ్య 60సెం.మీ మొక్కకు,మొక్కకు మధ్య 20సెం.మీ సరిపోతుంది.బోదెసాళ్ళు నీటిపారుదలకు,అధిక నీటిని తీసివేయటానికి మరియు పంట పెరుగుదలకు ఉపయోగపడతాయి.